27-12-2024 11:56:47 PM
అఫ్గానిస్థాన్‌తో తొలి టెస్టు
బులవాయో: సొంతగడ్డపై అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో జింబాబ్వే భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 586 పరుగులకు ఆలౌటైంది. మొదటి రోజు సీన్ విలియమ్స్ సెంచరీ చేయగా.. రెండో రోజు ఆటలో కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (176 బంతుల్లో 104), బ్రియాన్ బెన్నెట్ (124 బంతుల్లో 110 నాటౌట్) శతకాలతో చెలరేగారు. చివర్లో న్యుమన్ హురి (26), ముజరబానీ (19) రాణించడంతో జింబాబ్వే 550 మార్క్‌ను దాటింది. ఆఫ్గన్ బౌలర్లలో గజన్‌ఫర్ 3 వికెట్లు తీయగా.. జహిర్ ఖాన్, జియా ఉర్ రెహమాన్, నవీన్ జర్దన్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 30 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. రహమత్ షా (49*), హస్మతుల్లా (16*) క్రీజులో ఉన్నారు. ముజరబానీ, ట్రెవర్ చెరొక వికెట్ తీశారు.