27-12-2024 11:50:56 PM
సెంచూరియన్: దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా మారింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్(Pakistan) రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. బాబర్ ఆజం (16), సాద్ షకీల్ (8) క్రీజులో ఉన్నారు. అంతకముందు సౌతాఫ్రికా(South Africa) తొలి ఇన్నింగ్స్‌లో 301 పరుగులకు ఆలౌటైంది.టెయిలెండర్ కార్బిన్ బోస్క్ (93 బంతుల్లో 81 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. మార్రరమ్ (89) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బవుమా (31), బెడింగమ్ (30) పర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో షెహజాద్, నసీమ్ షా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అంతకముందు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. సఫారీలకు తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగుల ఆధిక్యం లభించింది.