19-11-2025 07:40:00 PM
నకిరేకల్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర గీతం అందించిన అందెశ్రీ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, తెలంగాణ ఉద్యమ జేఏసీ చైర్మన్ పూజర్ల శంభయ్య పేర్కొన్నారు. బుధవారం స్థానిక డిటిఎఫ్ జోనల్ శాఖ ఆధ్వర్యంలో మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, రచయిత అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ సమాజాన్ని ఉత్తేజపరిచే మాటలు పాటల ద్వారా తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచాడన్నారు.
డిటిఎఫ్ మండల శాఖ అధ్యక్షులు పోతుల గోపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు బి. వెంకటేశం, ప్రధాన కార్యదర్శి పి. వెంకులు, జిల్లా కార్యదర్శులు ఎం. నాగయ్య, ఈ. జగతి, బిసీపీ రాష్ట్ర నాయకులు గాజుల శ్రీను, న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి అంబటి చిరంజీవి, శాలిగౌరారం మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి .సైదులు కే. యాదగిరి కేతపల్లి మండల శాఖ అధ్యక్షులు ఎస్.కె. యాకూబ్ అలీ, జిల్లా పూర్వ అధ్యక్షులు ఎస్. విద్యాసాగర్ రెడ్డి, డీటీఎఫ్ బాధ్యులు జనార్దన్ రెడ్డి, అంజయ్య, కె. నగేష్, మల్లికార్జున్ రావు, నరసింహ చారి, భూపాల్, బి ఎం ఎస్ నాయకులు కాసిం పాల్గొన్నారు.