calender_icon.png 1 July, 2025 | 8:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన టెట్ పరీక్షలు

01-07-2025 02:15:57 AM

హైదరాబాద్, జూన్30 (విజయక్రాంతి): టెట్ పరీక్షలు సోమవారంతో ముగిశాయి. ఈనెల 18 నుంచి 30 వరకు టెట్ పరీక్షలను నిర్వహించారు. చివరి రోజు పేపర్-1, 2 పరీక్షలు జరగ్గా.. పేపర్‌కు-1కు 47,224 (74. 65 శాతం) మంది హాజరై.. 16,037 మంది గైర్హాజరయ్యారు. పేపర్-2 సోషల్ స్టడీస్‌కు 41,207 (76.73 శాతం) మంది హాజరై 12,499 మంది డుమ్మా కొట్టారు.

పేపర్-2 మ్యాథమెటిక్స్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్‌కు 48,998 (73.48 శాతం) మంది హాజరవగా, 17,688 మంది గైర్హాజరయ్యారు. ప్రాథమిక కీని జూలై 5న విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 8వ తేదీ వర కు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఫలితాలను 22న ప్రకటించే అవకాశముంది.