27-12-2025 02:24:30 AM
హైదరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) హాల్ టికెట్లను శనివారం నుంచి జారీ చేయనున్నారు. జనవరి 3 నుంచి 31 వరకు టెట్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం హాల్‌టికెట్లను అధికారులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
ఉద యం 9 నుంచి 11.30 గంటల వరకు మొ దటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సా యంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. టెట్ పేపర్1,౨కు మొత్తం 2,37,754 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరని సుప్రీం కోర్టు తీర్పు వె లువరించిన నేపథ్యంలో ఈసారిఉపాధ్యాయులు కూడా టెట్ రాస్తున్నారు.