calender_icon.png 27 December, 2025 | 7:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకట్రెండు రోజుల్లో ప్రవేశ పరీక్షల షెడ్యూల్!

27-12-2025 02:26:19 AM

హైదరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్స్‌లతోపాటు ఇతర ఉన్నత విద్యా కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఒకట్రెండు రోజుల్లో తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేయనుంది. ఇప్పటికే పూర్తి షెడ్యూల్ వివరాలతో కూడిన ఫైల్‌ను సీఎం ఆమోదం కోసం అధికారులు పంపించారు. ఆయన ఆమోదం లభించిన వెంటనే షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేయనుంది.

సోమవారంలోపు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. టీజీ ఎప్‌సెట్‌తోపాటు, ఐసెట్, పీజీఈసెట్, లాసెట్, పీఈసెట్, ఈసెట్ వంటి పరీక్షల షెడ్యూళ్లను విడుదల చేయనున్నారు. ఈసారి ప్రవేశ పరీక్షలను కాస్త ముందుగా ముగించాలని అధికారులు భావిస్తున్నారు.