calender_icon.png 26 November, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రి దేవస్థానంలో వస్త్రాల కాంట్రాక్టర్ నిర్వాకం

26-11-2025 12:00:00 AM

  1. స్వామి వారి వస్త్రాలను కాకుండా వేరే వస్త్రాలను అమ్మేందుకు ప్రయత్నం

విచారించి చర్యలు తీసుకుంటాం: ఈవో

భద్రాచలం, నవంబర్ 25,(విజయక్రాంతి):శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవ స్థానంలో శ్రీస్వామి వారి వస్త్రాల విక్రయ కాంట్రాక్టర్ నిర్వాకం మంగళవారం బయటపడింది. తెల్లవారుజామున శ్రీస్వామి వారికి భక్తులు సమర్పించే వస్త్రాలను పక్కదారి పట్టించి ఇతర తక్కువ విలువ గల వస్త్రాలను విక్రయించేందుకు ప్రయత్నించాడు.

ఈ విషయాన్ని గమనించిన దేవస్థాన ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వస్త్రాలను స్వాధీనం చేసుకుని దేవస్థాన కార్యనిర్వహణాధికారి కె.దా మోదర్రావుకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పం దించిన ఈవో .. వస్త్రాల కౌంటర్ భక్తులు సమర్పించిన వస్త్రాలు కాకుండా ఇతర వస్త్రా లు ఉన్న విషయం వాస్తవమేనని, ఈ అం శంపై సమగ్ర విచారణ జరిపించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.