calender_icon.png 25 July, 2025 | 8:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొంగులేటిని కలిసిన టీజీవో నేతలు

24-07-2025 01:26:16 AM

హైదరాబాద్, జూలై 23 (విజయక్రాంతి): రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలో పలువురు నేతలు బుధవారం కలిశా రు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు నేతలు తెలిపా రు.

సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ పునఃవ్యవస్థీకరణ ఫైల్‌ను మంత్రి తన స్థాయిలో క్లియర్ చేసి సీఎంవోకి పంపించినట్లు టీజీవో నేతలు పేర్కొన్నారు. అనంతరం సీఎంవో ప్రధాన కార్యదర్శి శేషాద్రి, ఉన్నతాధికారులు లోకేశ్ కుమార్, రాజీవ్ గాంధీ హనమంతులను కలిశారు. మంత్రిని కలిసిన వారిలో  బీ శ్యామ్,  నరహరిరావు,  ఏ కిషన్, రామారావు, శ్రీరామ్‌రెడ్డి ఉన్నారు.