24-11-2025 12:08:03 AM
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి
కరీంనగర్, నవంబరు 23 (విజయ క్రాంతి): నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరు సంవత్సరాలు నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన పార్టీ పెద్దలకు, నాతో నడిచి నాకు సహకరించిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. నూతనంగా నియమితులైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం, నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ లకు శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ కష్ట కాలంలో ఆనాటి నియంత కెసిఆర్ పాలనకు వ్యతిరేకంగా, మతతత్వ బీజేపీ కి వ్యతిరేకంగా నాతో కలిసి పోరాటం చేసిన కరుడు గట్టిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.
మీ ఉన్నతి కోసం నా వంతు భాధ్యతగా పార్టీ పెద్దల సహకారంతో కృషి చేస్తానని, ముఖ్యమంత్రి ఆశీస్సులతో, మంత్రులు, శాసనసభ్యుల సహకారంతో సుడా చైర్మన్ గా చేస్తున్న అభివృద్ధి, ఇతర కార్యక్రమాల ద్వారా ప్రజల మన్ననలు పొంది రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం నా వంతు కృషి చేస్తానని నరేందర్ రెడ్డిపేర్కొన్నారు.