calender_icon.png 25 July, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం

24-07-2025 12:39:14 AM

- నియోజకవర్గంలో 3882 కొత్త రేషన్ కార్డులు

- కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి

మందమర్రి, జూలై 23: రాష్ట్రంలోని ప్రతి మహిళను కోటీశ్వరులుగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర గనులు, కార్మిక శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. బుధవారం మండలంలోని అందుగులపేట సాయిమిత్ర గార్డెన్స్ లో ఇందిరా మహిళ శక్తి సంబరాలు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మహిళ సంఘాలకు రూ. 17.21 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కును అందించి మాట్లాడారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహి ళా సంక్షేమానికి కృషి చేస్తుందని, మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు వడ్డీ లేని రుణాల ద్వారా తమ వ్యాపారాలను విస్తృ తం చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా పలువురికి ఉపాధి కల్పించా లని ఆయన కోరారు. మహిళ సమాఖ్య సంఘాలకు తోడ్పాటు అందించేందుకు మహిళా శక్తి పథకంలో బాగంగా పట్టణంలో మహిళ లకు క్యాంటీన్లు, ఎలక్రిక్ బస్సులు, పెట్రోల్ బంక్‌లు మంజూరు చేస్తున్నామన్నారు.

సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించే విధంగా రేవంత్ రెడ్డి ప్రభు త్వం ప్రణాళికలు రూపొందిస్తుందని, సింగరేణి సంస్థలో పని చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం వేజెస్ పెంచేలా సింగరేణి సిఎండి తో చర్చించి అమలు చేస్తానని హామీ ఇచ్చారు. చెన్నూరు నియోజక వర్గంలో 3882 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశామని మంత్రి వివేక్ అన్నా రు. అంతే కాకుండా 3880 మంది పేర్లను రేషన్ కార్డుల్లో కొత్తగా పేర్లు నమోదు చేయ డం జరిగిందని, రేషన్ కార్డుల జారీ నిరంత ర ప్రక్రియ అని, రేషన్ కార్డులు రాని అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 

నియోజక వర్గంలో 3500 ఇందిరమ్మ ఇం డ్లు మంజూరు అయ్యాయని, లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు తొందరగా చేపట్టాలని కోరారు. అనంతరం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, డిఆర్డిఓ పిడి ఎస్ కిషన్, ఐకెపి డిపిఎం స్వర్ణలత, జిల్లా, మండల అధికారులు, కాంగ్రెస్ నాయకులు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.