calender_icon.png 15 December, 2025 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ పదవి వారికే సొంతం!

15-12-2025 02:17:25 AM

  1. సర్పంచ్‌గా ఐదుసార్లు భార్యాభర్తలు అందలం
  2. ప్రస్తుతం ‘దాట్ల’ ప్రథమ పౌరురాలిగా ఎన్నికైన మంజుల

మహబూబాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): ఒకటి కాదు రెండు కాదు ఏ కంగా ఐదో సారి కూడా ఆ దంపతులే గ్రా మానికి సర్పంచులుగా ఎన్నికై సరికొత్త రికా ర్డు సృష్టించారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామ సర్పంచ్ గా ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో కొమ్మినేని మంజుల విజయం సా ధించారు. 2001, 2006లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కొమ్మినేని రవీందర్ స ర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2013 లో గ్రామ సర్పంచ్ పదవి మహిళలకు కేటాయించడంతో రవీందర్ భార్య మంజుల ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు.

ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నిక ల్లో తిరిగి జనరల్ స్థానంగా ప్రకటించడంతో రవీందర్ సర్పంచ్‌గా పోటీచేసి ఎన్నికయ్యారు. తాజాగా ఆ గ్రామ సర్పంచ్ పదవి మహిళకు కేటాయించడంతో రవీందర్ భార్య మాజీ సర్పంచ్ మంజులను మళ్లీ ఎన్నికల బరిలో నిలిపాడు.

ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో మంజుల తమ సమీప ప్రత్యర్థి పై 260 ఓట్ల తేడాతో విజయం సాధించి వరుసగా కొమ్మినేని రవీందర్ మంజుల దంపతులు అయిదవ సారి గ్రామ సర్పంచ్ బాధ్యతలను చేపట్టే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.వరుసగా ఐదు సార్లు రవీందర్ మంజుల దంపతులు గ్రామ సర్పంచులుగా ఎన్నికవ్వడం అరుదైన ఘటనగా చెప్పుకుంటున్నారు.