15-12-2025 02:15:27 AM
పెద్దపల్లి జిల్లాలో సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ
కరీంనగర్, డిసెంబరు 14 (విజయ క్రాంతి): రెండవ విడత పంచాయతీ ఎన్నికలు చదరుముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నాలుగు జిల్లాల్లో కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 86.58 శాతం పోలిం గ్ నమోదయింది. పెద్దపల్లి జిల్లాలో ఎన్నికల విధులకు దూరంగా ఉన్న 181 మంది సి బ్బందికి జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లాలో ఐదు మం డలాల్లోని 111 గ్రామ పంచాయతీల్లో 1,85, 003 ఓటర్లకుగాను 1,60,184 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 86.58 శాతం పోలింగ్ నమోదయింది.
చిగురుమామిడి మండలంలో 85,82 శాతం, గన్నేరువరం మండలంలో 88.58 శాతం, మానకొండూ ర్ మండలంలో 86.66 శాతం, శంకరపట్నం మండలంలో 86.03 శాతం, తిమ్మాపూర్ మండలంలో 84.84 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ దంపతులు మానకొండూ ర్ మండలం పచ్చునూరులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిగురుమామిడి మండలం లేకొండలో సీపీఐ జాతీయ నా యకుడు చాడ వెంకటరెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జగిత్యాల జిల్లాలో 78.34%
రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జగిత్యాల జిల్లాలో 78.34 శాతం పోలింగ్ నమోదయింది. 134 గ్రామ పంచాయతీల్లో 2,08,168 ఓట్లర్లగాను 1,63,074 మంది ఓటు హక్కును వినియోగించుకున్నా రు. బీర్ పూర్ మండలంలో 80.25 శాతం, జగిత్యాల మండలంలో 81.26 శాతం, జగిత్యాల రూరల్ మండలలో 77.59 శాతం, కొడిమ్యాల మండలంలో 78.43 శాతం, మల్యాల మండలంలో 77.06 శాతం, రా యికల్ మండలంలో 79.11 శాతం, సారంగపూర్ మండలంలో 71.61 శాతం పోలింగ్ నమోదయింది.
పెద్దపల్లి జిల్లాలో 84.17 శాతం...
రెండవ విడతలో పెద్దపల్లి జిల్లాలో 84.17 శాతం పోలింగ్ నమోదయింది. 70 గ్రామ పంచాయతీల్లో 1,12,658 మంది ఓటర్లకుగాను 94,807 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతర్గాం మండలంలో 86.20 శాతం, ధర్మారం మండ లంలో 82.68 శాతం, జూలపల్లి మండలం లో 85.21 శాతం, పాలకుర్తి మండలంలో 83.88 శాతం నంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళి పరిశీలన...
గ్రామ పంచాయతీ రెండవ విడత ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో 162 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ స్క్రీన్ల ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రిటర్నింగ్ అధికారులకు సూచనలు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 84.41%
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండవ విడత పోలింగ్ 84.41 శాతం పోలింగ్ నమోదయింది. 79 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగగా 1,04,905 మంది ఓటర్లకుగాను 88,553 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇల్లంతకుంట మండలంలో 85. 12 శాతం, బోయినపల్లి మండలంలో 84.71 శాతం, తంగళ్లపల్లి మండలంలో 83.47 శాతం పోలింగ్ నమోదయింది.