30-08-2025 01:31:28 AM
- నిబద్దత, నిజాయితీకి మారుపేరు
- ౩౩ ఏళ్ల సర్వీసులో అతి స్వల్ప సెలవులు
- అన్ని వర్గాలకు ఆదర్శం ప్రభుదయాల్
- సాదాసీదాగా ఉద్యోగ విరమణ
భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 29 (విజయక్రాంతి): ఆయనో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి కళాశాల విద్య వరకు వివిధ హోదాల్లో పనిచేశారు. ఇందులో వింతేమి ఉందని అనుకుంటున్నా రు కదా.. అయితే ఆ ఉపాధ్యాయుడు తన ౩౩ ఏళ్ల సర్వీసులో అత్యవసరం అయితే త ప్పా ఏనాడు సెలవు పెట్టకపోవడం గమనార్హం. అందరికంటే ముందు బడికి రావ డం.. అందరి తర్వాతే ఇంటికి వెళ్లాలనే నైజం తో విధులు నిర్వహించేవారు.
ఎవరైనా పేదరికంతో బాధపడుతున్నవారికి తానున్నానని సాయం చేసే దయా హృదయుడు ఆయన. తనవద్ద చదువుకుని ఉన్నతస్థానాల్లో ఉన్న తన శిష్యులను కూడా ఆపదలో ఉన్నవారికి ఆదుకునేవారిలా తీర్చిదిద్దారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం జిల్లాపరిషత్ ఉన్న త పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు, మం డల విద్యాధికారి డాక్టర్ మారుమూడి ప్రభుదయాల్. ఈ నెల ౩0న ఆయన పదవీ విర మణ చేయనున్న నేపథ్యంలో ఆయన సేవలను పలువురు నెమరు వేసుకుంటున్నారు.
నిరుపేద మహిళకు ఇంటి నిర్మాణం
ప్రతి నెలా తన జీతంలో కొంతమేర ఖచ్చితంగా బీదలకు కేటాయించడం ప్రభుదయా ల్కు నిత్య కృత్యం. తన పదవీ విరమణ సమయంలోను ఎలాంటి కార్యక్రమాలకు, సన్మా న సభలకు వీలివ్వకుండా, తన స్వగ్రామం లో ఓ పేద మహిళకు ఇంటిని నిర్మించే పనిలో కృషి చేస్తున్నారు. డాక్టర్ ప్రభుదయాల్ స్వగ్రామం ఇల్లందు. తండ్రి బెంజ మిన్ ఉపాధ్యాయ ఉద్యోగం కొంతకాలం నిలిచిపోవడంతో చిన్ననాడే అనేక కష్టాలను చవిచూసి, వాటినే పాఠాలుగా నేర్చుకున్నా డు. అనేక ఉన్నత విద్యార్హతలను పట్టుదలతో, సునాయాసంగా, దీక్షతో సాధించారు. తన చిన్ననాట, చెప్పులు లేని కాళ్లతో, సరిగా దుస్తులు లభించని స్థితిని ఇప్పటికీ గుర్తుంచుకుని.. ఆనాడు తాను పడిన ఇబ్బందులు విద్యార్థులు పడకూడదనే తపనతో, తనస్థా యి మేర, తోచినంత స్థాయిలో అప్పటికప్పుడే సహాయం చేస్తున్నారు.
మొదట హాస్టల్ వార్డెన్గా..
1988లో కాకతీయ యూనివర్సిటీలో ఎమ్‌ఎడ్ చదివే క్రమంలో తాను సమర్పించిన పరిశోధనా పత్రాల గురించి తెలుసుకు న్న అప్పటి ఖమ్మం కలెక్టర్ లక్ష్మీపార్థసారథి భాస్కర్ నేరుగా ఎస్సీ హాస్టల్ వార్డెన్గా నియమించారు. దెందుకూరులో హాస్టల్ విద్యా ర్థులతో మమేకమై కొన్ని నెలలు మాత్రమే పని చేసిన ఆయన అనంతరం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నేరుగా గ్రేడ్- స్కూల్ అసిస్టెంట్గా నియామకం అయ్యారు.
1993 జనవరిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల టేకులపల్లిలో మొదట నియామకమై పిల్లలతో కలిసిపోయి గణితం బోధిస్తూ నేటికీ వి ద్యార్థుల మదిలో నిలిచిపోయారు. ఆనాడు చదివిన విద్యార్థుల్లో కొందరు నేడు జిల్లా స్థా యి అధికారులుగా పని చేయడం విశేషం. ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఖమ్మంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో టేకులపల్లి మండల ప్రగతిని ప్రశం సించారు. కార్యదక్షతను స్వయంగా గమనించిన అప్పటి కలెక్టర్ గిరిధర్ ఆసియాలోనే ప్రథమంగా భద్రాచలంలో ఏర్పాటుచేసిన తొలి గిరిజన బీఈడీ కళాశాలకు అధ్యాపకునిగా పనిచేయాలని ఆదేశాలు ఇచ్చారు. 2004లో గిరిజన బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్గా నియామకం అయ్యారు. కళాశాల పనితీరును గమనించిన ఢిల్లీకి చెందిన ఇగ్నో సంస్థ స్టడీ సెంటర్ను కేటాయించడం విశేషం.
పాఠశాల అభివృద్ధికి విశేష కృషి
2011లో డిప్యూటేషన్ కాలపరిమితి ముగియడంతో మాతృ సంస్థ అయిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల మేదర్ బస్తిలో ప్రభుదయాల్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా చేరారు. 2011లో ఎలాంటి గుర్తింపు, సౌకర్యాలు లేకుండా ‘కల్లు కొట్టు బడి’గా ప్రచారం పొందిన ఈ బస్తి బడి స్వరూపాన్నే మార్చేశారు. రెండుసార్లు పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 100% ఫలితాలను సాధించి ఔరా అనిపించారు. పదిలో ఏటా ఉత్తమ ఫలితాలను సాధించడమే కాకుండా బాసర ట్రిపుల్ ఐటీలో ఒక సీటును సాధించి రికార్డు సృష్టించారు. అప్పటి ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్.. దయాల్ పనితీరును ప్రశంసించారు. 2023 సెప్టెంబర్లో రామవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేరి ఇక్కడ తనదైన శైలిలో మార్పు ను తెచ్చారు.
రాష్ట్రస్థాయి ఉత్తమ హెచ్‌ఎం అవార్డుకోసం దరఖాస్తు చేయకపోయినా ప్రత్యేక జీవో ద్వారా అప్పటి విద్యాశాఖ ము ఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం దయాల్ను ఎంపిక చేసి సత్కరించారు. తనకు లభించిన పారితోషకం రూ.10 వేలను తిరిగి ముఖ్యమంత్రి సహాయ నిధికి వెంటనే చెల్లించి శెభాష్ అనిపించుకున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఆయనది. తన వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తూనే ప్రవృత్తిగా హైస్కూ లు స్థాయి పుస్తకాలు, బీఈడీ పుస్తక రచనతోపాటు విద్యాపరంగా అనేక పరిశోధనాత్మక వ్యాసాలను రచించారు. దీంతో పలు జాతీ య సంస్థలు దయాల్కు ‘జ్యూవెల్ ఆఫ్ ఇండియా‘, ’బెస్ట్ ఎడ్యుకేటర్’,‘బెస్ట్ ఆఫీసర్’, ‘బెస్ట్ ప్రిన్సిపాల్’ గా పలు అవార్డులను అందించాయి.
సీదా సాదాగా ఉద్యోగ విరమణ తన ౩౩ ఏళ్ల సర్వీసులో సాధారణంగా ఉంటూ ఎంత మందినో ఉన్నతంగా తీర్చిదిద్దిన ప్రభుదయాల్.. శనివారం జరిగే ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ఎలాంటి హంగూ ఆర్బాటం లేకుండా సాధారణంగా జరుపుకొంటున్నారు. అవసర సమయంలో చేసే సహాయం లో లభించే తృప్తి మరే విధంగాను ఉండదన్నారు.