22-09-2025 01:15:52 AM
తన జీవితంలో చేసిన ఓ పని ఇప్పటికీ బాధపెడుతూనే ఉంటుందని నటి అనుపమ పరమేశ్వరన్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన కిష్కింధపురి మూవీ సక్సెస్ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని వెల్లడించారు. అనుపమ మాట్లాడుతూ..‘మన జీవితంలో ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో చెప్పలేం. అందుకే కుటుంబం, ప్రేమ, స్నేహంలో పట్టువిడుపు ఉండాలి. కోపాన్ని మనసులో పెట్టుకుంటే చివరకు విషాదమే మిగులుతుంది.
నాకో ప్రాణ స్నేహితుడు ఉండేవాడే. కొంతకాలం కింద మా మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దీంతో అతడితో మాట్లాడటం మానేశా. అనేక సార్లు మెసెజ్ చేసినా రిప్లే ఇవ్వలేదు. అలాగే ఓసారి మెసెజ్ పంపారు. నేనూ పట్టించుకోలేదు. రెండు రోజుల తర్వాత అతడు చనిపోయాడని తెలిసి, షాకయ్యా. ఒక్కోసారి మనల్ని ప్రేమించే వాళ్లతో వచ్చే మనస్పర్ధలు జీవితాంతం విషాదాన్ని మిగులుస్తాయి’ అని అనుపమ చెప్పుకొచ్చారు.