calender_icon.png 18 July, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అంటేనే అలా..

18-07-2025 12:38:06 AM

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పరదా’. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు శ్రీధర్ మక్కువ, విజయ్ డొంకాడ నిర్మాతలు. ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్, థీమ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఆగస్టు 22న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన టీమ్.. థీమ్ ఆఫ్ పరదా పేరుతో ‘యత్ర నార్యస్తు పూజ్యంతే..’ అనే పాటను విడుదల చేశారు.

అనంతరం ముఖ్యఅతిథి నిర్మాత సురేశ్‌బాబు దగ్గుబాటి  మాట్లాడుతూ.. “సినిమా పరిశ్రమ ముందుకు సాగాలంటే ‘పరదా’ లాంటి చిత్రాలు రావాలి” అని చెప్పారు. అతిథి, నటుడు సత్యదేవ్ మాట్లాడుతూ.. ‘సినిమా ఎప్పుడు విడుదలైందన్నది ముఖ్యం కాదు.. ఎంత విజయం సాధించిందనేదే ముఖ్యం” అన్నారు. అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. “అమ్మాయి మెయిన్ లీడ్‌గా పోస్టర్‌పై కనిపించిందంటే చాలు..

ఎవరూ ముందుకు రారు. అది ఎంత మంచి సినిమా అయినా అంతే. ఇది తప్పు అనడంలేదు కానీ, ఇది వాస్తవం. ఇది చాలా మంచి చిత్రం. ఎన్నో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ కాదు.. కంటెంట్ బేస్డ్ ఫిల్మ్. ఈ సినిమా విడుదలైన తర్వాత దీని గురించి చర్చించుకుంటారు. ఇలాంటి సినిమాలు తీసేందుకు చాలా మంది దర్శకులు ముందుకొస్తారు” అన్నారు.

దర్శకుడు ప్రవీణ్ మాట్లాడుతూ.. “ఇది కొత్త కంటెంట్. ఇప్పటివరకూ ఇలాంటి సినిమా రాలేదు. సమాజంలో మనకు ఎదరయ్యే సమస్యను దీంట్లో చూపించాం. ఈ కథ విన్న తర్వాత నిర్మాత సురేశ్‌బాబు కళ్లల్లో నీళ్లు తిరిగాయి.. ఆ సందర్భం నాకెంతో ప్రత్యేకం. సినిమా అంతా పరదాలోనే ఉండాలంటే ఏ నటీ అంగీకరించదు. ఇలాంటి ఛాలెంజింగ్ రోల్‌ను అనుమప ఓకే చేశౠరు. మా టీమ్ అందరికీ ఇది బాహుబలి లాంటి సినిమా” అన్నారు.