11-10-2025 01:21:47 AM
అలంపూర్ అక్టోబర్ 10:దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ పై దాడి చేసిన దుండగుని కఠినంగా శిక్షించాలని కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు ఏ పరంజ్యోతి అన్నారు. శుక్రవారం కెవిపిఎస్ మానవపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో గాంధీ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై బూటు విసిరి దాడి చేయడానికి ప్రయత్నించిన రాకేష్ కిషోర్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని అన్నారు. మనువాదులకు భారత రాజ్యాంగం పట్టా గౌరవం సుప్రీంకోర్టు పట్ల భయం లేదని అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కి రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మధు నాయకులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.