calender_icon.png 9 May, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంతలో సముద్రఖని

27-04-2025 12:00:00 AM

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ మూవీ ‘కాంత’. భాగ్యశ్రీ బోర్సే ఇందులో కథానాయికగా నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ -ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. ఇప్పటికే నాయకానాయికల ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా ఈ చిత్రం నుంచి మరో ముఖ్యమైన పాత్రను పరిచయం చేశారు. సముద్రఖ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్టు వెల్లడించారు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని టీమ్ శనివారం అతని ఇంటెన్స్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.

అద్భుతమైన మోనోక్రోమ్ ప్యాలెట్‌లో ప్రజెంట్ చేసి ఈ పోస్టర్‌లో సముద్రఖని ఫెరోషియస్ అవతార్‌లో కనిపించారు. సినిమా విడుదల తేదీ త్వరలో అనౌన్స్ చేయనున్నారు. ఈ చిత్రానికి బ్యానర్లు: స్పిరిట్ మీడియా, వేఫేరర్ ఫిల్మ్స్; డీవోపీ: డాని శాంచెజ్ లోపెజ్; సంగీతం- ఝను చంతర్; ఆర్ట్: రామలింగం; ఎడిటర్: లెవెల్లిన్ ఆంథోనీ గోన్సాల్వేస్; నిర్మాతలు: రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్; రచన: తమిళ్ ప్రభ; దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్.