10-09-2025 12:00:00 AM
-మొదటి విడత టెండర్లు దాఖలు వైనం
-వ్యాపారుల సిండికేట్ పాత బకాయిలపై పంచాయతీ ఈనెల 12 వరకు పొడిగించిన ప్రభుత్వం
-జిల్లాలో బకాయిలు 4.5 కోట్లు
-ఆందోళన చెందుతున్న మత్స్య కార్మికులు
నిర్మల్, సెప్టెంబర్ (విజయక్రాంతి): దేవు డు వరమిచ్చిన పూజారి కరుణ లేదు అనే రీతి లో నిర్మల్ జిల్లాలో చేప పిల్లల విడుదల పం చాయతీ ముదిరింది. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులతో పాటు చెరువులన్నీ నిండుకోవడంతో ప్రభుత్వం చేప పిల్లలను పంపిణీ చేస్తే తమకు జీవనోపాధి దక్కుతుందన్న మచ్చ కార్మికులకు ఆశలు అడియాశలుగా మారుతున్నాయి. నిర్మల్ జిల్లాలో చేప పిల్లల పంపిణీ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను ప్రారంభించగా ఈనెల 8 వరకు టెండ ర్లు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
నిర్మల్ జిల్లాలో పాత బకాయిలు చెల్లిస్తేనే 2025 సంవత్సరానికి చేప పిల్లలను సరఫరా చేస్తామని చేపల చెరువుల యజమా నులు మొండికేయడంతో చేప పిల్లల విడుద ల మరింత కానుంది. . మొదటి విడతలో చేప పిల్లల సరఫరాకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం నాలుగు రోజుల గడువులు పెంచి ఈనెల 12 వరకు టెండర్ల ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. అయితే నిర్మల్ జిల్లాలో 2023 రూ.3.23 కోట్లు 2024 రూ.1.34 కోట్ల బకాయి చెల్లిస్తేనే ఈ సంవత్సరం చేప పిల్లలను సరఫరా చేస్తామని చేప పిల్లల బిల్డర్లు సిండికేట్ గా మారి టెండర్లు వేస్తామని ప్రకటించడంతో ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించడం ముడిపడి జిల్లాలో చేపల వృత్తి చేసే కార్మికులు ఆందోళన చెందుతున్నారు
అసలే జాప్యం ఆపై పంచాయతీ..
నిర్మల్ జిల్లాలో శ్రీరామ్ సాగర్ కడెం గడ్డినవాగు స్వర్ణ ప్రాజెక్ట్, కడెం నారాయణరెడ్డి రెడ్డి ప్రాజెక్టు పాలసీ రంగారావుకర్ ప్రాజెక్టు 502 చెరువుల్లో 2025 26 సంవత్సరానికి గాను 4.28 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని మత్స్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందులో 80 నుంచి 100 ఎం ఎం ల చేప పిల్లలు 2.66 కోట్లు 35 నుంచి 40 ఎం ఎం ల చేప పిల్లలు 2.22 కోట్ల చేప పిల్లలను సాగునీటి వనరులు విడుదల చేయాలని జిల్లా మత్స్యశాఖ ప్రణాళికలను రూపొందించింది. ఇందులో బొత్స రవాణా మరో రెండు రకాల చేప పిల్లలు సరఫరాకు టెండర్లను కోరింది. జిల్లాలో చేపల చెరువుల్లో చేప పిల్లలు ఉత్పత్తి చేసే కాంట్రాక్టు లైసెన్స్ ఉన్నవారు నలుగురు కావడంతో వారు సిండికేట్ గా మారి పాత బకాయిలు చెల్లిస్తేనే ఈ సంవత్సరం చేప పిల్లలను సరఫరా చేస్తామని ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేశారు.
జిల్లాలో మొత్తం 228 మత్స్య పారిశ్రామిక సంఘాలు ఉండగా ఇందులో 54 మహిళా పారిశ్రామిక సంఘా లు ఉన్నాయి. జిల్లాలో 13 1 29 మచ్చ కార్మికులు ఉండగా వీరు సాగునీటి ప్రాజెక్టులతో పాటు చెరువుల్లో చేపల వృత్తి జీవనాధారంగా తమ కుటుంబాలను పోషించుకుం టున్నారు. ప్రతి సంవత్సరం జూన్ జూలై మాసంలో నిండిన చెరువులు ప్రాజెక్టులో చేప పిల్లలు విడుదల చేస్తే అవి ఏడాదిలో పై కేజీకి మారే అవకాశం ఉంది. ప్రస్తుతం సెప్టెంబర్ మాసం ముగింపుకు రావడంతో టెండర్ల ప్రక్రియ ఇంకా ఖరారు కాకపోతే చేప పిల్లలు నీటిలో వేసినఅభివృద్ధి చెందే అవకాశం లేద ని దీనివల్ల తమకు తీవ్రమైన కలుగుతుందని మత్స్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మచ్చ కార్మికులకు జీవన భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం 100% సబ్సిడీపై ప్రతి సంవత్సరం చేప పిల్లలను సరఫరా చేస్తున్న విషయం తెలిసింది. చేప పిల్లలు విడుదల ఆల స్యం కావడం అసలు టెండర్ల ప్రక్రియ ఉం టుందా ఉండదన్న అనుమానాలు మచ్చ కార్మికుల కుటుంబాల్లో చీకటి బతుకులను చూపిస్తున్నాయి. అధికారులు మాత్రం ఈనెల 12 లోపు రెండో దశ టెండర్ల ప్రక్రియలో చేప పిల్లల పంపిణీ టెం డర్లు ఖరారు చేసే విధంగా లైసెన్స్ బిల్డర్లపై ఒత్తిడి తెస్తున్నారు. మరో రెం డు రోజులు గడువు ఉండడంతో టెండర్ల ప్ర క్రియ పైని మత్స్య కార్మికుల భవిష్యత్తు ఆధారపడి ఉండడంతో ప్రభుత్వం జోక్యం చేసుకొ ని సమస్య పరిష్కరించాలని జిల్లా మత్స్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం
జిల్లాలో మత్స్య కార్మికుల టెండర్ల విషయమై నెలకొన్న సమస్యను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. చేప పిల్లల టెండర్‌దారులు సెంటిగ్రేట్‌గా మారి చేప పిల్లల సరఫరాకు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం కూడా వారి పెండింగ్ చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటుందని వివరించడం. జిల్లాలో గుర్తించబడిన ప్రాజెక్టులు చెరువుల్లో ఈ నెలాఖరు వరకు చేప పిల్లల పంపిణీ ప్రక్రియ పూర్తి చేసి మత్స్య కార్మికుల కుటుంబాలకు జీవనో భరోసా కల్పిస్తాం.
రాజ నరసయ్య, జిల్లా అధికారి
ఆలస్యం జరుగుతే ఉపాధికి గండి
నిర్మల్ జిల్లాలో ఆలస్యంగా కురిసిన వర్షాలతో ప్రాజెక్టులు చెరువులు నీటితో నిండుకున్నాయి. ఇప్పుడు చేప పిల్లలను నీటి లో వదిలితేనే అవి వృత్తి చెంది తమకు జీవన భరోసా కల్పిస్తా యి. జూన్ జూలై మాసంలోని చేప పిల్లల టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఆగస్టులో చేప పిల్లలు విడుదల చేస్తేనే మత్స్య కార్మికులకు ప్రయోజనం ఉంటుంది. ప్రభుత్వం చేప పిల్లల విడుదల్లో జాప్యం చేయడం వల్ల చేపల వృద్ధిపై ఆ ప్రభావం పడటంతో జిల్లాలో మచ్చ కార్మికులకు ఉపాధికి గండి పడే అవకాశం ఉంది.
జింక లక్ష్మీనారాయణ, చేపల కార్మికుడు