calender_icon.png 18 January, 2026 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చికిత్స పొందుతూ మహిళ మృతి

18-01-2026 02:05:38 AM

  1. సికింద్రాబాద్ న్యూ లైఫ్ ఆస్పత్రిలో ఘటన
  2. బిల్లు చెల్లిస్తేనే మృతదేహాన్ని ఇస్తామన్న యాజమాన్యం 

సికింద్రాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నెల రోజులు గా చికిత్స పొందుతున్న ఓ మహిళ మృతి చెందింది. అయితే బకాయి పడిన బిల్లులు ఇస్తేనే శవాన్ని అప్పగిస్తామంటూ ఆస్పత్రి నిర్వాహకులు భీష్మించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. బాధితులు తెలిపిన వివరా లిలా ఉన్నాయి. సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఉన్న న్యూ లైఫ్ హాస్పిటల్‌లో మెట్టుగూడ ప్రాంతానికి చెందిన  శ్రీనివాస్ భార్య దేవి (45 ) ఫిజియోథెరపీ చికిత్స కోసం గత నెల 17న చేరింది. నెల రోజులకు రూ. 50వేలు ఫీజుగా ఒప్పందం కుదుర్చుకున్న వారు రూ.20వేలు చెల్లించి అడ్మిట్ చేశారు. ఆమె ఆరోగ్యం విషమించడంతో శనివారం రాత్రి మృతి చెందింది.

దీంతో ఆమె కుటుంబసభ్యులు మృతదేహాన్ని అప్పగించాలని కోరగా, మొత్తం రూ.95 వేలు బిల్లు అయిందని, చెల్లించింది పోను మిగతా రూ.74వేలు చెల్లించాలని ఆసుపత్రి వర్గాలు చెప్పాయని దేవి భర్త శ్రీనివాస్ తెలిపారు. తాము అంత డబ్బు కట్టలేమని చెప్పగా మిగతా డబ్బులు చెల్లిస్తేనే శవాన్ని హ్యాండోవర్ చేస్తామని చెప్పడంతో మృతురాలి బంధువులు ఆస్పత్రివ వద్ద ఆందోళనకు దిగారు. చివరకు శ్రీనివాస్ తన వద్ద ఉన్న రూ.18వేలు చెల్లించిన తర్వాత ఆస్పత్రి వర్గాలు తన భార్య మృతదేహాన్ని అప్పగించారని చెప్పారు.

వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఆమె  చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపించా రు. ఈ ఘటనపై ఆస్పత్రి హెడ్ హరిత స్పందిస్తూ నెల రోజుల పాటు ఆమె అందించిన వైద్యానికి గాను  బిల్లులు చెల్లించాలని అడిగామని అన్నారు. అందు కు వారు నిరాకరించి మా సిబ్బందిపై దాడి చేశారని ఆరో పించారు. పేషెంట్‌కు అత్యవసరమైన ఇంజెక్షన్లు, మందులు వేయా ్స ఉందని, వాటిని తెచ్చి ఇవ్వాలని కోరినా వారు నిర్లక్ష్యం చేశారని, దీంతో ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించి మరణించిందన్నారు.ఆస్పత్రి ట్రేడ్ లైసెన్స్ విషయమై ప్రస్తావించగా లైసెన్స్ కోసం కోసం దరఖాస్తు చేశామని చెప్పారు.