22-09-2025 12:05:40 AM
తూప్రాన్, సెప్టెంబర్ 21 :రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్ త్రిబుల్ ఆర్ గా వాడుకలో ఉన్న గ్రీన్ ఫీల్ ఎక్స్ప్రెస్ హైవే కు సం బం ధించిన భూసేకరణ పనులు చివరి దశలో ఉన్నాయని ఆర్డీవో జయచంద్రారెడ్డి తెలిపారు. భూసేకరణలో అన్ని ప్రక్రియలు ముగిసి, నష్టపరిహారాన్ని నిర్ణయించే దశలో ఉన్నట్లు తెలుస్తుంద న్నారు.
రైతులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఇతర వివరాలను రెవెన్యూ సిబ్బంది సేక రించి నేషనల్ హైవే అథారిటీ వారి వ్బుసైట్ అయిన భూమి రాశి పోర్టల్ లో నమోదు చేస్తున్నా రు. ఈ నమోదు ప్రక్రియలో సాంకేతికంగా సంక్లిష్టంగా ఉండడం వల్ల ఆలస్యం అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని సిబ్బంది ఆదివారం సెలవు రోజైనా పనిచేస్తున్నారని అన్నారు.
రైతుల ఇంటి వద్దకే వెళ్లి వారితో సిబ్బంది వ్యక్తిగతంగా మాట్లాడటం వల్ల రైతులకు ఈ ప్రక్రియ మీదున్న సందేహ నివృత్తి జరుగుతుందని ఆర్డిఓ తన సిబ్బందికి ఆదేశించడంతో, వారు గ్రామ పంచాయతీలో కూర్చొని నోటీసులు ఇవ్వకుండా, రై తుల ఇంటి వద్దకే వెళ్లి నోటీసులు ఇస్తూ, వారికి భరోసాను కల్పిస్తున్నారు. మొత్తం మీద నెల రో జుల వ్యవధిలో రైతులకు ఆర్డిఓ నిర్ణయించిన ధర ప్రకారం జిల్లా కలెక్టర్ నిర్ణయించే ధర ప్రకారం రెండో విడతగా డబ్బులు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందని ఆర్డీవో తెలిపారు.