calender_icon.png 22 September, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుకునూరు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో బతుకమ్మ సంబురాలు

22-09-2025 12:05:00 AM

వేల్పూర్, సెప్టెంబర్21 (విజయ క్రాంత్): కుకునూరు ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు వేల్పూర్ మండలంలోని కుకునూరు ఉన్నత పాఠశాలలో  విద్యార్థినిలు ఆదివారం రోజున ఘనంగా నిర్వహించారు.

విద్యార్థులు వివిధ రకాల పూలతో  బతుకమ్మను పేర్చి, హిం దూ సాంప్రదాయకంగా బతుకమ్మ పాటలు పాడుతూ పాడుతూ అందరిని అలరించి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు టీ. హరిచరణ్, ఉపా ధ్యాయ బృందం పతాని గంగాధర్, శ్రీధర్ రావు, మల్కన్నా, నాగరాజు, రవీందర్, చరణ్ దాస్, అశోక్, హరిత,40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు నృత్య ప్రదర్శనతో అలరించారు.

కామారెడ్డి జిల్లాలో..

కామారెడ్డి, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్సువాడ బిచ్కుంద పట్టణాలతోపాటు మండల కేంద్రాలు గ్రామాల్లో మహిళలు ఆదివారం ఎంగిలి బతుకమ్మ ఆట ఆడారు. తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ ఉత్సవాలు సద్దుల బతుకమ్మ చివరి రోజు నిర్వహించనున్నారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కన్యక పరమేశ్వర ఆలయంలో ఆర్యవైశ్య మహిళలు ప్రత్యేకంగా బతుకమ్మ పాటలతో సందడి చేశారు. విద్యానగర్ పాత సాయిబాబా  మందిర్, సిరిసిల్ల రోడ్లోని ధర్మశాల ఆంజనేయస్వామి ఆలయం, పంచముఖ హనుమాన్ ఆలయం, తోపాటు పలు కాలనీ లాలోని ఆలయాల వద్ద బతుకమ్మ ఆటలు ఆడి నిమజ్జనం చేశారు.