22-09-2025 12:04:14 AM
శివంపేట, సెప్టెంబర్ 21 :శివంపేట్ మండల కేంద్రంలోని భగలాముఖి శక్తిపీఠ ఉపాసకులు శాస్త్రల వెంకటేష్ శర్మ ఆధ్వర్యంలో అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ భగలాముఖి శక్తిపీఠం అమ్మవారి దేవస్థానంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి హోమ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకు లు పబ్బ రమేష్ గుప్త, తాజా మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్, తాజా మాజీ ఉప సర్పంచ్ పద్మ వెంకటేష్, తాజా మాజీ వార్డు సభ్యులు వంజరి కొండల్, బసంపాలి పోచగౌడ్, కొవ్వురి వెంకటేష్, సీనియర్ నాయకులు బసంపల్లి రామా గౌడ్, వరగంటి రమేష్ గుప్త, దొడ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.