calender_icon.png 14 October, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుబాయ్‌లో ఐలాపూర్ యువకుడి ఆత్మహత్య

13-10-2025 12:43:34 AM

కామారెడ్డి, అక్టోబర్ 12 (విజయక్రాంతి): గల్ఫ్‌కు వెళ్లి కష్టపడి అధికంగా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటానని వెళ్లిన యువకుడు దుబాయ్‌లోని షార్జాలో శనివారం బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన మన్నే సంగమేశ్(32) అనే యువకుడు దుబాయ్‌కి 28 అక్టోబర్ 2024 లో వెళ్ళాడు. అక్కడ అల్తురై కంపెనీలో లేబర్ వర్క్ చేస్తున్నాడు.

ఎన్నో ఆశలతో వెళ్లిన సంగమేష్ ఆత్మహత్య చేసుకోవడం కుటుంబ సభ్యులను తీవ్రంగా కల్చివేసింది. అతని మృత దేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చే విధంగా స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కృషి చేయాలని కుటుంబ సభ్యులు గ్రామస్తులు కోరుతున్నారు. ఐలాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంగమేశ్వర్ కుటుంబ సభ్యుల రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టిస్తున్నాయి.