15-12-2025 12:00:00 AM
దుబాయి, డిసెంబర్ 14 : వరల్డ్ క్రికెట్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఆధిపత్యం కొనసా గుతూనే ఉంది. ఆసియాకప్‌లో సీనియర్ జట్టు, తర్వాత మహిళల వన్డే ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్ అండ్ కో, ఇప్పుడు అండర్ 19 ఆసియాకప్‌లో భారత కుర్రాళ్లు పాక్‌ను చిత్తు చేశారు. దుబాయి వేదికగా జరుగుతున్న అండర్ 19 ఆసియాకప్‌లో ఆయుశ్ మాత్రే సారథ్యంలోని భారత జట్టు 90 పరుగుల తేడాతో పాక్‌పై ఘనవిజయం సాధిం చింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఇన్నింగ్స్ తడబడి నిలబడింది.
ఫామ్‌లో ఉన్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (5) నిరాశపరిచాడు. అయితే కెప్టెన్ ఆయుశ్ మాత్రేతో కలిసి హైదరాబాదీ బ్యాటర్ ఆరో న్ జార్జ్ ఇన్నింగ్స్ నడపించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించాడు. మాత్రే(38) రన్స్‌కు ఔటైనా ఆరోన్ జార్జ్ (85) మిగిలిన బ్యాటర్లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. చివర్లో కనిష్క్ చౌహా న్(46) ధాటిగా ఆడడంతో భారత్ అండర్ 19 జట్టు 46.1 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. తర్వాత ఛేజింగ్‌లో భారత యు వ బౌలర్లు దుమ్మురేపారు.
పాక్ జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆరంభం నుంచే వికెట్లు పడగొట్టారు. టాపార్డర్, మిడిలార్డర్‌లో కీలక బ్యాటర్లందరినీ త్వరగానే పెవిలియన్‌కు పంపించారు. హుజైఫా అహసాన్ 70 పరుగులతో పోరాడినా ఫలితం లేకపోయింది. మిగిలిన బ్యాటర్ల నుంచి సపోర్ట్ లేకపోవడంతో పాక్ 41.2 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కనిష్క్ చౌహాన్ 3, దీపేశ్ దేవేంద్రన్ 3 . కిషన్ కుమార్ సింగ్ 2 వికెట్లు తీశారు.
ఈ టోర్నీలో భారత్‌కు ఇది రెండో విజయం. చివరి మ్యాచ్‌లో భారత్ మలేషియాతో తలపడుతుంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లోనూ భారత్ పాక్ జట్టుతో నో షేక్ హ్యాండ్ విధానాన్నే కొనసాగించింది. ఆసియాకప్‌లో భారత సీనియర్ జట్టు పాక్ ప్లే యర్స్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. పహల్గాం దాడికి నిరసనగా వారితో కరచాలనం చేసేందుకు నిరాక రించారు.
అప్పట్లో ఇది పెద్ద దుమారాన్ని రేపింది. తర్వాత భారత మహిళల జట్టు సైతం ఇదే ఫాలో అయింది. ఇప్పుడు అండ ర్ 19 జట్టు కూడా వెనక్కి తగ్గలేదు. యువ ఆటగాళ్ల మ్యాచ్‌లో రాజకీయా లు తీసుకురావొద్దని ఐసీసీ కోరినా బీసీసీఐ మాత్రం నో షేక్ హ్యాండ్ విధానానికే కట్టుబడింది.