calender_icon.png 18 August, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరోమారు మెరిసిన కుర్రాళ్లు..

24-10-2024 12:00:00 AM

ఎమర్జింగ్ ఆసియా కప్ టీ20

అమెరత్: ఏసీసీ పురుషుల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టీ20లో భారత జట్టు మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న తిలక్ సేన.. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే చేసింది. 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 15.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఆయుష్ బదోని అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు.