calender_icon.png 12 September, 2025 | 3:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిబిడ్డల ఆరోగ్యానికి 115 విద్యాసంస్థలలో మెడికల్ కిట్ల ఏర్పాటు

12-09-2025 01:02:29 AM

  1. రూ.13 లక్షలు వెచ్చింపు

ఐటీడీఏ పీవో దూరదృష్టి

పిల్లలకు ఆరోగ్య భరోసా 

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 11, (విజయక్రాంతి):వర్షాకాలం వ్యాధులు వ్యాప్తి చెందే సీజన్. ప్రధానంగా విద్యాసంస్థల్లో పి ల్లలు రకరకాల అనారోగ్య ఇబ్బందులు పడుతుంటారు. ఈ విషయాన్ని ముందే పసిగ ట్టిన భద్రాచలం ఐటిడిఏ పిఓ రాహుల్ పిల్ల ల ఆరోగ్య పరిరక్షణకు పూనుకున్నారు. గిరిజన విద్యాసంస్థల్లో యుద్ధప్రాతి పలికిన మెడికల్ కిట్లను ఏర్పాటు చేశారు.

ఇవి పిల్లలకు బాగా ఉపకరిస్తున్నాయి. గిరిజన విద్యా సంస్థల్లో విద్యా ప్రగతికి ఇప్పటికే పెద్దపీట వేస్తూన్న పిఓ రాహుల్ మరో అడుగు ముందుకేసి పిల్లల ఆరోగ్య భద్రతకు నడుంబిగింవారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...

గిరి బిడ్డల ఆరోగ్యంకై

భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్ గిరిజన విద్యార్థుల సర్వతో ము ఖాభివృద్ధికి కంకణం కట్టుకున్న విషయం విధితమే. బాల బాలికలకు విద్యలో చక్కని పునాదులు పడేలా చర్యలు తీసుకున్నారు. కెరీర్ గైడెన్స్ తదితర ఉపయోగకర అంశాలను తెరపైకి తీసుకువచ్చి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై కూడా దృష్టి సారిస్తున్నారు.

విద్యలో రాణిస్తున్న వారికి ప్రోత్సా హకాలు ఎన్నో అందిస్తూ వస్తున్నారు. ట్రైబల్ మ్యూజియం ద్వారా గిరిజన సంస్కృ తి పరిరక్షణకు పూనుకున్నారు. గిరిజన పిల్లలు విద్యలో ఉన్నత స్థానాలు పొందేందుకు కావలసిన జ్ఞానాన్ని వారు అందిపు చ్చుకునేలా రకరకాల మార్గాల్లో వారిని ప్రోత్సహిస్తున్నారు.

ఇదిలా ఉంటే మరోవైపు వారి ఆరోగ్య పరిరక్షణకు నడుం బిగించారు. వర్షాకాలం సీజన్లో వ్యాధులు పొంచి ఉండే నేపథ్యంలో పిల్లలు అనారోగ్యం పాలైతే వెంటనే చికిత్స అందేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. మెడికల్ కిట్లను గిరిజన విద్యా సంస్థలకు యుద్ధప్రాతిపదికన తరలించారు.

115 విద్యాసంస్థలలో

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 115 గిరిజన విద్యా సంస్థలకు రూ.13 లక్షలు విలువ చేసే మెడికల్ కిట్లను కొనుగోలు చేసి వాటిని అందజేశారు. ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్, పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టల్స్ కు సరఫరా చేశారు.

ఇల్లందు డివిజన్లో 13 ఆశ్రమం పాఠశాలకు,10 హాస్టల్స్ కు, దమ్మపేట డివిజన్లో 18 ఆశ్రమ పాఠశాలకు, 12 హాస్టల్స్ కు, భద్రాచలం డివిజన్లో 12 ఆశ్రమ పాఠశాలకు 10 హాస్టల్స్ కు 4 ప్రీమిట్రిక్ హాస్టల్స్ కు, ఖమ్మం డిస్ట్రిక్ట్ లో 30 హాస్టల్స్ కు ఆశ్ర మ పాఠశాలకు ఈ మెడికల్ కిట్లను అందజేశారు.

రూ.13 లక్షలు వెచ్చింపు

గిరిజన పిల్లలకు అత్యవసరమైన ఈ మెడికల్ కి ఇట్లను ఏర్పాటు చేయుటకు ఐటీడీఏ పీవో రాహుల్ రూ.13 లక్షలు వెచ్చిం చారు.అడిషనల్ డిఎంహెచ్వో సైదులు, డిప్యూటీ డిఎంహెచ్వో చైతన్య పర్యవేక్షణలోహైట్ స్కేల్, వెయిట్ స్కేల్, ధర్మామీటర్,ఐవి స్టాండ్, బిపి ఆపరేటర్, స్టెతస్కోప్, బ్యాండైడ్, టార్చ్, ప్లాస్టిక్ బాక్స్ తదితర ఆరోగ్య పరికరాలను కొనుగోలు చేసి గిరిజన విద్యా సం స్థలకు పంపించారు.

ఆ విద్యా సంస్థల్లో పని చేసే ఏఎన్‌ఎంకు ఇవి పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ఎంతగానో ఉపకరించనున్నాయి. గిరిజ న విద్యా ప్రగతికి శక్తివంచన మేరకు కృషి చేస్తూ వస్తున్న భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ వారి ఆరోగ్య పరిరక్షణ పట్ల కూడా చూపిస్తున్న చొరవపట్ల గిరిజన బాలబాలికల తల్లిదండ్రులు హర్షాతిరేఖలు వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం లాంటి ఐటీడీఏకు ఇటువంటి అధికారి ఉంటే గిరి ప్రగతి అన్నింట సాధ్యమవుతుందని పలువురు ప్రశంసిస్తున్నారు.

ఐటీడీఏ పీవో బి. రాహుల్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 60 ఆశ్రమ పాఠశాలలు 33 పోస్టుమెట్రిక్ హాస్టల్స్ 22 ఫ్రీ మెట్రిక్ హాస్టల్స్ లలో దాదాపు 28 వేల మంది గిరిజన విద్యార్థినీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని వారికి విద్యతో పాటు మంచి ఆహారం అందించి వారి ఆరోగ్య స్థితిగతులను కూడా కాపాడడానికి అన్ని ఇన్స్టిట్యూషన్లకు మెడికల్ కి ఇట్లు సరఫరా చేసి విద్యార్థినీ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు.