calender_icon.png 12 September, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నదాత... అరి గోస

12-09-2025 12:00:00 AM

-వర్షాలు వరదల్లో వరదలతో కృల్లిపోయిన పంటలు

-వరద నష్టం 12వేల ఎకరాలకు పైగానే

-జిల్లాలో పూర్తయిన వ్యవసాయ శాఖ అధికారుల సర్వే

-పరిహారంపై నోరెత్తని ప్రభుత్వం

-రెండో పంట వేసుకోలేని పరిస్థితి

నిర్మల్ సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో గత నెల 27 నుంచి కురిసిన వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. వాన కాలంలో సాగుచేసిన పంటలకు భారీ వర్షాల వల్ల వాగులు గొర్రెలు చెరువు లు నదులు ఉప్పొంగి ప్రవహించడంతో వరదదాటికి పంటలు నీట మునగడమే కాకుండా కొట్టుకపోయాయి. నిర్మల్ జిల్లాలో 79 వ్యవసాయ కష్టాల పరిధిలో వర్షాలు వరదల వల్ల20, 000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారులు వంచన వేస్తున్నారు.

జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు స్వర్ణ వాగు ప్రాజెక్ట్ గడ్డన్న శుద్ధ వాగు తో పాటు గోదావరి పరివాహక ప్రాంతమైన బాసర లోకేశ్వరం దిల్వార్పూర్ సొన్ లక్ష్మణ చందా ఖానాపూర్ కడెం దస్తురాబాద్ మండలాల్లో పత్తి సోయా మొక్కజొన్న వరి పసుపు తదితర పంటలు మూడు రోజులపాటు నీటిలోనే ఉండడంవల్ల అధిక నీటితో కూలిపోయినట్టు రైతులు పేర్కొంటున్నారు. దీనికి తోడు సారంగాపూర్ నర్సాపూర్ కుబీర్ కుంటాల తదితర మండలాలు చెరువు అలుగులు వాగుల వల్ల వరదల్లో తీవ్ర నష్టం జరిగినట్టు రైతులు పేర్కొంటున్నారు. 

అధికారుల సర్వే

నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల రైతులు సాగు చేసుకున్నాం పంటలు నష్టపోవడంతో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంటను సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందించినట్టు తెలిపారు. జిల్లాలోని 79 వ్యవసాయ క్లస్టర్లలో ఏఈవోలు ఆయా కష్టాల పరిధిలో భారీ వర్షాలు వరదల వల్ల దెబ్బతిన్న వివిధ పంటలను సర్వే నెంబరు ఫోటో రైతు పేరు పంట నష్టం ఎకరాలు తదిత వివరాలను నమోదు చేసుకొని ఆన్లున్ చేశారు.

జిల్లాలో మొత్తం 12,804 రైతులు 19530 ఎకరాల్లో వివిధ పంటలు నష్టపోయినట్టు తెలిపారు. ఇందులో వరి పంట 59 82 ఎకరాలు పత్తి 38:40 సోయా 62 86 మొక్కజొన్న 18 85 పసుపు 10 62 ఆయిల్ సీడ్ పంట 326 ఎకరాలు నష్టపోగా మిగతాది పప్పు దినుసులు పంటలు కూరగాయ పంటలు నష్టపోయినట్లు అధికారులు సర్వే నిర్వహించారు.

వాన కాలంలో పంటలు సాగు చేసుకునేందుకు దుక్కులు దునడాన్ని మొదలుకొని విత్తనాలు వేయడం కలుపు తీయడం ఎరువులు వేయడం కూలీల ఖర్చులు పిచికారి మందులతో ఎకరానికి 10,000 వరకు ఖర్చు వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే అధిక వర్షాలు ఆపై వరదలు పంటలను నీటిలో ముంచడంతో పంట పొలాల్లో నీరు నిలిచిపోవడం వల్ల కూలిపోయి పంట చేతికి వచ్చే అవకాశాలు లేదని ఆయా గ్రామాల రైతులు కన్నీటి పర్యవంతమవుతున్నారు.

మరో నెలరోజులు కడితే పంటలు చేతికొచ్చి దశలో తాము పంట కోల్పోలువలసి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు వ్యవసాయ పంట భూములు కోతలు ఏర్పడి ఇసుక మేటలు కూడా వేయడంతో వాటిని తొలగించాలంటే వేలాది రూపాయల ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం సర్వే చేసి పంట నష్టం వివరాలను జిల్లా వ్యవసాయ శాఖ ద్వారా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన పరిహారంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు

ప్రభుత్వం ఆదుకుంటేనే మేలు

ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల నేపథ్యంలో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటేనే మేలు జరుగుతుందని రైతులు పేర్కొంటున్నారు. జిల్లాలో భారీ వర్షాలు వరదల వల్ల నష్టపోయిన పంటలను జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి వేడుమ బుజ్జి పటేల్ రామారావు పటేల్ క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు జరిగిన నష్టం పై విచారం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం పరిహారాన్ని ఎకరానికి 25 వేలు చెల్లించాలని బిజెపి ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుండగా అధికార పార్టీ మంత్రి మాత్రం ప్రభుత్వం ఆదుకుంటుంది అని చెప్పారు తప్ప ఎకరానికి ఇంత డబ్బులు ఇస్తామని ఎక్కడ స్పష్టం చేయకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంటలు నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకునేలా నష్టపరిహారాన్ని ప్రకటించి రెండు పంట పెట్టుబడికి బ్యాంకు రుణాలు అందించాలని జిల్లా రైతులు కోరుతున్నారు