12-09-2025 01:03:20 AM
-గరియాబంద్ జిల్లాలో 10 మంది మావోయిస్టుల హతం
-మావోయిస్టులు మధ్య కొనసాగుతున్న ఎదురుకాల్పులు
-కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ మృతి
-మనోజ్ తలపై కోటి రివార్డు
రాయ్‌పూర్, సెప్టెంబర్ 11: ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లా లో గురువారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మధ్య ఉదయం నుంచి జరిగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. మెయిన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు సంచరిస్తున్నట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందిన వెంటనే గరియాబంద్ ఈ30, ఎస్టీఎఫ్, కోబ్రా బృందం సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి.
ఈ ఎన్‌కౌంటర్‌లో కేంద్రకమిటీ సభ్యుడు , వరంగల్ జిల్లా ఘన్‌పూర్‌కు చెందిన మనోజ్ అలియాస్ మోదెం బాలకృష్ణ అలియాస్ బాలన్న అలియాస్ భాస్కర్ ధీర్, ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రమోద్ యారఫ్ పాండుతో పాటు 10 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. మనోజ్ అలియాస్ భాస్కర్ ధీర్ తలపై రూ. కోటి రివార్డు ఉంది. యాంటీ మావోయిస్టు ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడినట్టు రాయ్‌పూర్ రేంజ్ ఐజీ అమ్రేష్ మిశ్రా తెలిపారు.
‘స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రా బెటాలియన్, స్థానిక పోలీసులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఇరు వర్గాల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి’ అని ఐజీ పేర్కొన్నారు. బుధవారం నారాయణ్‌పూర్ జిల్లాలో 16 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయా రు.‘ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలో జ రిగిన ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడితో పాటు 10 మరణించారు’ అని పోలీ సులు ప్రకటించారు.
కొనసాగుతున్న ‘కగార్’
వచ్చే ఏడాది మార్చి 30 వరకు మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్రప్రభు త్వం ప్రకటించిన నాటి నుంచి ఆపరేషన్ కగా ర్ మావోయిస్టులలో వణుకు పుట్టిస్తుంది. ఈ ఆపరేషన్ ద్వారా ఇప్పటికే వందల సంఖ్యలో మావోయిస్టులు, కేంద్ర కమిటీ సభ్యులు మరణించారు. మరికొంత మంది పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. దేశవ్యాప్తంగా ఆపరేషన్ ‘కగార్’పై వ్యతిరేకత వ్యక్తమవుతున్నా భద్రతాబలగాలు మాత్రం ఆపరేషన్‌ను కొనసాగించడం గమనార్హం.
8 లక్షల రివార్డు ఉన్న నక్సలైట్ హతం
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో తలపై రూ. 8 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. డీఆర్‌జీ, బీఎస్పీఎఫ్ బలగాల తో ఈ ఆపరేషన్‌ను ఈ నెల 7న మొదలుపెట్టినట్టు కాంకేర్ ఎస్పీ ఎలిసేలా తెలిపారు.