calender_icon.png 12 September, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాప్ డిగ్రీ కాలేజీల్లోనూ సీట్లు ఖాళీ

12-09-2025 01:05:36 AM

-4.38 లక్షల సీట్లలో భర్తీ కానివి 2.41 లక్షలు

-నేటి నుంచి దోస్త్ స్పాట్ అడ్మిషన్లు

-ప్రభుత్వ కాలేజీల్లోనూ ఈసారి అమలు

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): ఎప్పటిలాగే ఈ విద్యాసంవత్సరం కూడా డిగ్రీ కాలేజీల్లో సీట్లు భారీగా మిగిలాయి. ఏకంగా టాప్ కాలేజీల్లోనూ సీట్లు పూర్తిగా నిండలేదు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు కలిపి మొత్తం 967 డిగ్రీ కాలేజీలుండగా, అందులో 4,38,387 సీట్లలో 1,96,451 సీట్లే ఇప్పటివరకు నిండా యి.

ఇంకా 2,41,936 సీట్లు మిగిలే ఉన్నా యి. ప్రభుత్వ కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ సీట్లు భారీగా మిగిగడం గమనార్హం. సీట్లు మిగిలిన కాలేజీల్లో ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ కాలేజీ మహిళా డిగ్రీ కాలేజీ వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ, ప్రభుత్వ సిటీ కాలేజీ వివేకానంద డిగ్రీ కాలేజీ బాబు జగ్జీవన్‌రాం డిగ్రీ కాలేజీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ నిజాం కాలేజీ, మ హిళా డిగ్రీ కాలేజీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీ ఉన్నాయి. ఈ 12 కాలేజీల్లో మొత్తం 16,197 సీట్లలో 13,339 సీట్లు నిండగా, ఇంకా 2,858 సీట్లు మిగలడం గమనార్హం.

12 నుంచి డిగ్రీ స్పాట్ అడ్మిషన్లు: విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి

గురువారం తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్ పురుషోత్తం, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ విడుదల చేశారు. బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. శుక్రవారం నుంచి డిగ్రీ స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందన్నారు. సీట్ల వివరాలను నోటీస్ బోర్డులో పెట్టాలని కాలేజీలకు ఆదేశించారు.

ఈసారి నుంచి అన్ని ప్రభుత్వ కాలేజీల్లోనూ స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈనెల 15, 16 తేదీల్లో అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టనున్నామని పేర్కొన్నారు. 17న సీట్లు పొందిన విద్యార్థుల వివరాలను దోస్త్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని, 18, 19వ తేదీల్లో వన్ టైమ్ స్పెషల్ స్పాట్ అడ్మిషన్ రౌండ్‌ను నిర్వహిస్తామని, 20న సీట్లు పొందిన విద్యార్థుల వివరాలు పోర్టల్‌లో నమోదు చేసేందుకు అవకాశమిచ్చినట్టు తెలిపారు.

స్పాట్ అడ్మిషన్లలో సీట్లు పొందే వారికి ఫీజు రీయింబ ర్స్ మెంట్ వర్తించదన్నారు. నిబంధనల ప్రకా రం అడ్మిషన్లను ఆయా కాలేజీలు చేపట్టాలని ఆయన సూచించారు. అడ్మిషన్స్ రిజిస్ట్రే షన్ ఫీజును రూ.425గా నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే అన్ని కాలేజీల్లో ముఖగుర్తింపు హాజరు విధానాన్ని అమలు చేసి, 75 శాతం హాజరు ఉన్నవారికి మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందనే నిబంధనను పెట్టాలని విద్యాశాఖ భావి స్తోంది.

గతంలోనూ మినిమం అటెండెన్స్ విధానమున్నా, కొన్ని కాలేజీలు విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకొని హాజరు వేస్తున్నారనే విమర్శలుండేవి. నేడు జరిగే యూనివర్సిటీ వీసీల సమా వేశంలో ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు, కొత్త కోర్సు లు, ప్రొఫెసర్ పోస్టుల భర్తీ, కాంట్రాక్ట్ అధ్యాపకులకు వెయిటేజీ, వర్సిటీలకు నిధులు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలను చర్చించనున్నారు.