02-09-2025 12:00:00 AM
చర్ల, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): మండలం కేంద్రంలో గల బస్టాండ్ ప్రాంగణంలో వర్షం వచ్చిందంటే బురదమయం కనీసం నడవలేని పరిస్థితి కనిపిస్తోంది, నిత్యం బస్సుల రద్దీతో ఉండే బస్టాండ్ గుంతల మయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు,. అదేవిధంగా బస్టాండ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన ఆరో ప్లాంట్ పట్టుమంటూ మూడు నెలలు కూడా ఉపయోగించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది.
దాతల సహాయంతో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేశారు కానీ ప్రయాణికుల సౌకర్యం దాన్ని మరమ్మతులు చేయించి ఉపయోగం లోకి తెచ్చే పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు. వర్షాకాలం వచ్చిందంటే ఈ ప్రాంతమంతా గోదావరిని కల్పించే విధంగా వర్షపు నీరు గుంతలలో ఆగుతుంది అధికారులు స్పందించి బస్టాండ్ ప్రాంతంలో ఫ్లోరింగ్ ఏర్పాటు చేసి ప్రయాణికుల సౌకర్యార్థం డివిజన్ వ్యాప్తంగా ఉన్న భద్రాచలం బస్టాండ్ తర్వాత అతిపెద్ద బస్టాండ్ గా చర్ల బస్టాండ్ చెప్పవచ్చు దీన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులకు ఎంతైనా ఉంది, టీఎస్ ఆర్టీసీ అధికారులు స్పందించి బస్టాండ్ సమస్యను పరిష్కరించాల్సిందిగా మండల ప్రజలు కోరుతున్నారు.