07-01-2026 12:00:00 AM
న్యూఢిల్లీ, జనవరి 6: కరూర్ తొక్కిసలాట కేసు విచారణలో భాగంగా ఈనెల 12న ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో హాజరుకావాలని టీవీకే అధినేత విజయ్‌కి మంగళవారం సమన్లు జారీ చేసింది. గతేడాది సెప్టెంబర్ 27న తమిళనాడులో కరూర్‌లో విజయ్ నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా గాయాలపాలైన సంగతి తెలిసిందే.
తమిళనాడు ప్రభుత్వం ఘటనపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను నియమించగా, సిట్ దర్యాప్తుపై అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో సుప్రీం కోర్టు జోక్యంతో కేసు సీబీఐ టేబుల్‌పైకి వెళ్లింది. సీబీఐ అధికారులు ఇప్పటికే ఈ కేసులో సుమారు 200 మంది సాక్షుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఈక్రమంలోనే తాజాగా విజయ్‌కి సమన్లు జారీ చేసింది.