18-12-2025 12:00:00 AM
డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్
ఆదిలాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి) : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మార్చడాన్ని ఖండిస్తున్నామని, కేంద్రం మహాత్మా గాంధీని కించపరిచేలా వ్యవహరిస్తోందని డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ అన్నారు. పేదలకు ఉపాధి కల్పించి వారికి అండగా నిలబడేందుకు గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని కేంద్రం నీరుగారిచేలా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.
టీపీసీసీ, ఏఐసీసీ పిలుపులో భాగంగా ఉపాధి హామీ పథకం పేరు మార్పును ఖం డిస్తూ స్థానిక తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బుధవారం ధర్నా నిర్వహించారు. రహదారిపై బైటాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ మాట్లాడుతూ.. 2005 లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చారని, గాంధీని అవమానించే రీతిలో ప్రస్తుతం పేరును మార్పు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి సభ్యురాలు గండ్రత్ సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ సంజీవ్ రెడ్డి, నాయకులు గిమ్మ సంతోష్, కలాల శ్రీనివాస్, లోక ప్రవీణ్, శ్రీలేఖ, ప్రేమల, నహిద్, మునిగెల నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.