calender_icon.png 21 May, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఐఎస్‌ఐ’తో జ్యోతి మల్హోత్రా కోడ్ భాష

21-05-2025 01:22:30 AM

  1. పాక్‌కు గూఢచర్యం కేసులో సంచలన విషయాలు
  2. పాకిస్థాన్, చైనా తదితర పర్యటనలపై ఎన్‌ఐఏ ఆరా
  3. గూఢచర్యం ఆరోపణతో 12 మంది అరెస్ట్

న్యూఢిల్లీ, మే 20: పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ అరెస్టయిన హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారత్‌లో అండర్‌కవర్ ఏజెంట్ల ను గుర్తించేందుకు పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ‘ఐఎస్‌ఐ’ను ఆమె వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఐఎస్‌ఐ హ్యాండర్లతో ఆమె కోడ్ భాషలో మాట్లాడినట్టు సమాచారం.

కాగా మంగళవారం ఎన్‌ఐఏ, ఇంటలిజెన్స్ బ్యూరో అధికారులు వివిధ కోణా ల్లో ప్రశ్నల వర్షం కురిపించారు. పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్, దుబాయ్‌ల్లో ఆమె చేసిన పర్యటనలపై వారు ప్రధానంగా దృష్టి సారించారు. కాగా జ్యోతి తన అంతర్జాతీయ పర్యటనలకు సంబంధించిన విషయాలను డైరీలో పొందు పరిచిందన్నారు. 10 నుంచి 11 పేజీల నిడివి గల డైరీలో మూడు పేజీలు పాకిస్థాన్‌కు సంబంధించిన విషయాలను ఇంగ్లీష్‌లో రాసిందని అధికారులు పేర్కొన్నారు.

ఈ కేసును ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వస్టిగేటింగ్ ఏజెన్సీకి అప్పగించే అంశాన్ని హోంశాఖ పరిగణలోకి తీసుకురానున్నట్టు అధికారుల బృందం వెల్ల డించింది. పాక్ హైకమిషన్ అధికారులు, పాక్ ఇంటిలిజెన్స్ విభాగానికి చెందిన వ్యక్తులు.. ప్రచారం కోసం సమాచారాన్ని సేకరించడానికి ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూ ట్యూబర్లను ఉపయోగించుకుంటున్న కుట్ర కోణాన్ని దర్యాప్తూ చేపట్ట నున్నట్టు ఒక అధికారి తెలిపారు.

మరోవైపు పాకిస్థాన్‌తో సంబంధమున్న గూఢచర్య నెట్‌వర్క్‌పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు వారాల వ్యవధిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 12 మందిని అరెస్టు చేశారు. పంజాబ్‌లో ఆరుగురు, హరియాణాలో ఐదు గురు, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితులు పాక్ నిఘా వర్గాలకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్టు దర్యాప్తులో వెల్ల డైందని స్పష్టం చేశారు. వారి ఆర్థిక లావాదేవీలను సునిశితంగా పరిశీలిస్తున్నామ ని, ఎలక్ట్రానిక్ పరికరాల ఫోరెన్సిక్ విశ్లేషణ కూడా జరుగుతోందని తెలిపారు.