07-08-2025 12:21:46 AM
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ఆమన గల్లు,ఆగస్టు6:బీసీ రిజర్వేషన్లు 42శాతం అమలు విషయంలో కేంద్రప్రభుత్వం తమ వైఖరిని స్పష్టం చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు బీసీ బిల్లు ను వెంటనే అమలు చేయాలని కల్వకుర్తి నియోజకవర్గం కు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బుధవారం పార్లమెంట్ ఎదుట నిర్వహించిన ధర్నా లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ వేదికగా జరిగిన 42% బీసీల రిజర్వేషన్ పై వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలని ఈ బిల్లుకు ఆమోదం తెలపాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల భాగంగా 42 శతం బీసీల రిజర్వేషన్ అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి తో రాజీలేని పోరాటం చేస్తుందని కేంద్రం మెడలు వంచైన బీసీలకు రిజర్వేషన్ అమలు అమలుకు పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.