calender_icon.png 22 May, 2025 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘పది’లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం

02-05-2025 12:13:40 AM

బూర్గంపాడు, మే1(విజయక్రాంతి):  పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో సారపాక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు.బూర్గంపాడు మండలం సారపాకలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీలు కింథాడ వల్లి శ్రీ అలివేణి 559 మార్కులు,ఆరె పోగు అక్షయ 515 మార్కులతో మండలంలోనే అన్ని ప్రభుత్వ పాఠశాలల కన్నా అత్యధిక మార్కులు సాధించారు.

వీరిద్దరిని గురువారం పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హెచ్ దూద,పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు ఎం సత్యనారాయణ,ఆంగ్ల ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు ఆర్ ఉమామహేశ్వర్ రాజు, జీవశాస్త్ర ఉపాధ్యాయులు బి లక్ష్మణ్ తదితరులు వీరిద్దరికి పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాలతో సన్మానించారు.

చదువులో మంచి మార్కులు సాధించి పాఠశాలకు మంచి పేరు  తీసుకొచ్చినందుకు అభినందనలు తెలియజేస్తూ స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు దూద మాట్లాడుతూ.. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పదవ తరగతి ఉత్తీర్ణత శాతం పెరిగిందని తెలుగు మీడియంలో 62.5శాతం,ఆంగ్ల మీడియంలో 80.56 శాతం ఉత్తీర్ణత సాధించారని , ముఖ్యంగా 25 మంది అమ్మాయిలకు గాను 24 మంది పాస్ అవ్వడమే కాక మంచి మార్కులు సాధించారని తెలియజేశారు.

ఈ ఫలితాల సాధనకు  పట్టుదలతో కృషి చేసిన సబ్జెక్టు టీచర్లు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. పీఎం శ్రీ పథకం కింద ఈ పాఠశాలకు అనేక సౌకర్యాలు కల్పించబడుతున్నందున ఈ పాఠశాలలో పూర్తిస్థాయి సిబ్బంది అందుబాటులో ఉన్నందున ఎక్కువ మంది తమ పిల్లల్ని ఈ పాఠశాలలో చేర్పించి మంచి చదువుని అందుకోవాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.