calender_icon.png 24 July, 2025 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లందులో విద్యాసంస్థల బంద్ సంపూర్ణం

23-07-2025 07:49:56 PM

ఇల్లందు (విజయక్రాంతి): ఇల్లందు నియోజకవర్గంలో వామపక్ష విద్యార్థి సంఘాలు నిర్వహించిన విద్యాసంస్థల బందు సంపూర్ణంగా ముగిసింది. విద్యార్థులకు సంబంధించిన అనేక సమస్యలు గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం కారణంగా సమస్యలు సమస్యలుగానే పేరుకుపోయాయని వామపక్ష విద్యార్థి సంఘాలు బందుకు పిలుపునిచ్చాయి. ప్రధానంగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ, రాష్ట్రంలో నూతన విద్యా విధాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో అసెంబ్లీని ముట్టడి చేస్తామని వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు.