calender_icon.png 24 July, 2025 | 7:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా స్టాక్ సీజ్.. కేసు నమోదు

23-07-2025 07:50:21 PM

నిబంధనలకు విరుద్ధంగా ఎరువులను విక్రయిస్తే చట్టరీత్య చర్యలు 

అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్

మునుగోడు,(విజయక్రాంతి): దుకాణదారులు ఎరువులను నిబంధనకు విరుద్ధంగా విక్రయిస్తే ఎరువుల చట్టం 1985  ప్రకారం చట్టనిత్యా చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండలంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం-2  మునుగోడు షాప్ లో వ్యవసాయ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు.  తనిఖీలలో  యూరియా,ఇతర ఎరువులు బిల్లులు మరియు ఇతర దస్త్రాలను,స్టాక్ రిజిస్టర్లు,బిల్ బుక్కులు  పరిశీలించారు. యూరియా 179 బస్తాలు  బిల్లులు  మరియు  ఈపాస్  బిల్లు  కానీ ఇవ్వకుండా  అమ్మినట్లు గుర్తించారు. 

నిబంధనలకు విరుద్ధంగా  యూరియా విక్రయిస్తే  చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మండల వ్యవసాయ అధికారి 146 బస్తాల యూరియా స్టాక్ ను సీజ్ చేసి 6-ఏ కేస్  నమోదు చేశారు. మండలంలోని దుకాణదారులు యూరియాను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణీత ధరలకు మాత్రమే తప్పనిసరిగా రైతులకు బిల్లులు ఇచ్చి ఎరువులను విక్రయించాలని,లేనిచో కఠినమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోఆర్డిఓ శ్రీదేవి, ఏడిఏ వేణుగోపాల్, తాసిల్దార్ నేలపట్ల నరేష్ వ్యవసాయ అధికారిని పద్మజ ఉన్నారు.