calender_icon.png 25 December, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు సంఘటితంగా మారాలి

25-12-2025 02:41:19 AM

  1. హర్యాన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
  2. కరీంనగర్‌లో కిసాన్ గ్రామీణ మేళా ప్రారంభం

కరీంనగర్, డిసెంబరు 24 (విజయక్రాంతి): రైతులు సంఘటితంగా మారాలని, తద్వారానే వారి ఉత్పత్తులను వారు వస్తుమార్పిడి చేసి, అధిక ధరలకు అమ్ముకునే అవకాశం ఉంటుందని హర్యానా మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తా త్రేయ తెలిపారు. కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో కిసాన్ గ్రామీణ మేళాను బుధవారం ఆయన ప్రారంభించారు. అనేక యం త్రాలు, సీడ్స్, డైరీ, ఆర్గానిక్ స్టోర్స్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. రైతులు తమ భూములను భూసా ర పరిచయం చేసుకొని తగిన మోతాదులో ఎరువులు వాడటం వలన అధిక పంటలు పండించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.  కిసాన్ జాగరణ అధ్యక్షుడు, కిసాన్ గ్రామీణ మేళా నిర్వాహకులు పొలసాని సుగుణాకర్‌రావు మాట్లాడుతూ.. గ్రా మీణ ప్రజల ఆర్థిక సామాజిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందన్నారు.

కరీంనగర్ డెయిరీ 12 వేల సభ్యత్వంతో ప్రారంభమై ఈరోజు లక్షకు పైగా సభ్యులతో తెలంగాణలోనే అత్యధిక పాలు, పాల ఉత్పత్తులు వ్యాపారం చేసే సంస్థగా ఎదిగిందని కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వరరావు తెలిపారు.  మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు,  మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.