14-09-2025 01:41:03 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి) : హైదరాబాద్ రాష్ర్ట తొ లి ముఖ్యమంత్రి డా.బూర్గుల రామకృష్ణారావు రాజకీయం, న్యాయ వ్యవస్థలపై అవగాహన, ప్రజల పట్ల నిబద్ధత నేటి తరానికి ఆదర్శమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బహు భాషావేత్తగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, రాజనీతిజ్ఞుడిగా రాష్ట్రానికి అందించిన సేవలను ఆయన వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి స్మరించుకున్నారు.
రెవెన్యూ మంత్రిగా వినోబా భావే ప్రారంభించిన భూదానోద్యమానికి రామకృష్ణారావు చట్ట బద్ధత కల్పించి భూ సంస్కరణలకు నాంది పలికారని గుర్తు చేశారు. రాజకీయ రంగంలోనే కాకుండా సాంఘిక సాంస్కృతిక రంగాల్లో బూర్గుల విశిష్ట సేవలందించారని ఆయనను గుర్తు చేసుకున్నారు.