స్కూల్ బస్సుల్లో భద్రత ఏదీ?
03-07-2026 12:00 AM
బోధన్, జూలై 2 (విజయక్రాంతి): బోధన్ పట్టణంలో గురువారం ఉదయం ఆర్టీవో అధికారులు పాఠశాల బస్సులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో భాగంగా అధికారులు సుమారు 12 స్కూల్ బస్సులను క్షుణ్ణంగా పరిశీలించారు.
సరైన పర్మిట్లు, ప్రథమ చికిత్స కిట్లు (ఫస్ట్ ఎయిడ్ కిట్లు), అలాగే అగ్నిమాపక యంత్రాలు (ఫైర్ ఎక్స్టింగ్విషర్లు) లేకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ నడుపుతున్న 6 బస్సులపై వీసీఆర్ లు నమోదు చేసి కేసులు బుక్ చేశారు. విద్యార్థుల భద్రతే ప్రాధాన్యంగా ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు వెల్లడించిన అధికారులు, నిబంధనలు పాటించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.






