calender_icon.png 26 September, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంజారాల ఓట్లతోనే గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం

26-09-2025 12:01:54 AM

డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్య నాయక్.

మరిపెడ సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి): బంజారాలా ఓట్లతోనే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని డి.ఎస్ రెడ్యా నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో లంబాడీల హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లంబాడీ ఆత్మ గౌరవ సభలో మాజీ ఎంపీ మాలోత్ కవిత, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్య నాయక్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్ లో తన అల్లుడి ఫార్మా కంపెనీ కోసం భూములను లాక్కుంటుంటే ఆరోజు లంబాడి బిడ్డ జ్యోతి అక్కడ ఎదిరించి ఢిల్లీలో మాట్లాడిందని కుట్రతోటే ఇదంతా రేవంత్ రెడ్డి ఆడిస్తున్న నాటకం అన్నారు. మహబూబాబాద్ డోర్నకల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారంటే లంబాడీలు వేసిన బిక్ష అని, ఎస్టీ రిజర్వేషన్ ఉన్నది కాబట్టే ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. నీకు వచ్చింది ఒకే ఒక ఉద్యోగం.. రామచందృ నాయక్ ఆ ఉద్యోగం కూడా త్వరలో ఊడిపోతుందన్నారు.

తెలంగాణలో ఉన్న లంబాడీలకు రిజర్వేషన్ ఇవ్వలేదని, 1980లో మన తెలంగాణలో లంబాడి సోదరులను గిరిజన తెగలోకి తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో లంబాడీలు 50 నుంచి 60 నియోజకవర్గాల్లో ఎవరికి ఓటు వేస్తే అక్కడ వారే ఎమ్మెల్యేగా గెలుపొందే అవకాశాలు ఉన్నాయన్నారు.  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మేనిఫెస్టో చెప్పిన 420 హామీలను నమ్మి బంజారా బిడ్డలు ఏకతాటిపై వన్ సైడ్ గా ఓట్లు విషయాన్ని మర్చిపోకూడదన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్  రవిచంద్ర, బద్రునాయక్, అరుణ రాంబాబు, శారద రవీందర్, గుగులోతు వెంకన్న నాయక్,ఎల్ హెచ్ పి ఎస్ భూక్యా రామ్మూర్తి నాయక్, మరిపెడ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు అజ్మీర రెడ్డి నాయక్, భోజ్య నాయక్, బాలాజీ నాయక్, లంబాడి సంఘాల నాయకులుపాల్గొన్నారు.