calender_icon.png 26 September, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు, రేపు అతిభారీ వర్షాలు!

26-09-2025 12:00:00 AM

  1. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
  2. పలు జిల్లాలకు హెచ్చరికలు
  3. ఉత్తర తెలంగాణపై తీవ్ర ప్రభావం

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో రాష్ట్రం లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. ఈ రెండు రోజులపాటు ఉత్తర తెలంగాణతోపాటు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.

శుక్రవారం  ఉమ్మడి ఆదిలాబాద్‌తోపాటు పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షా లు కురిసే అవకాశం ఉంది. అలాగే శనివారం నాడు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూ బాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు.

దీనితోపాటు ఇతర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీచేసిం ది. అటు తర్వాత మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్ల్లాని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.