calender_icon.png 29 November, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

29-11-2025 12:31:48 AM

  1. బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా, కేంద్ర ప్రభుత్వంపై పోరాడకుండా సర్పంచ్ ఎన్నికలకు వెళ్లడం సిగ్గుచేటు

కాంగ్రెస్ పార్టీ నాటకాలను ఆపి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలి

హనుమకొండ, నవంబర్ 28 (విజయ క్రాంతి):మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా హన్మకొండ కాకతీయ యూనివర్సిటీ లోని పూలే దంపతుల విగ్రహలకు వరంగల్ ఉమ్మడి బీసీ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా బీసీ జే ఏసీ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ దశాబ్ద కాలం క్రితమే మహా త్మా జ్యోతి రావ్ పూలే వెనుకబడిన బలహీన వర్గాల ప్రజలు విద్య, ఉద్యగ, రాజకీ య రంగాలలో సమాన వాటా రావాలని క లలు కన్నారు, వారి ఆశయాలకు అనుకూలంగా జనాభాలో 60 శాతం ఉన్న బీసీలు మేంమెంతో మాకు అంత వాటా ఇవ్వాలని పోరాడుతున్న బీసీలకు, ఈ అగ్రవర్ణలకు చెందిన పార్టీలు కనీసం స్పందించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లను కల్పించకుండ, కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయకుండా గతంలో ఉన్న 23 శా తం బీసీ రిజర్వేషన్లను 17 శాతానికి కుదించి సర్పంచ్ ఎన్నికలకు వెళ్లడం సిగ్గుచేటన్నారు. బీసీ రిజర్వేషన్లను కల్పించకుండా సర్పంచ్ ఎన్నికలను నిర్వహిస్తూ, రెడ్ల ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగి న గుణపాఠం నేర్పే విధంగా బీసీల పోరాటా న్ని ఉదృతం చేయనున్నట్లు ఆయన తెలిపా రు.

ఇప్పటికైనా రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీపై ఒత్తిడి పెంచాల ని, డిసెంబర్ మొదటి వారంలో జరగనున్న పార్లమెంట్ సమావేశాలను 243 మంది ఇండియా కూటమి పార్లమెంట్ సభ్యులచే పార్లమెంట్‌ను స్తంభింప చేసేందుకు కాంగ్రె స్ అగ్రనేత రాహుల్ గాంధీని ఓప్పించాలని లేకుంటే ప్రజాక్షేత్రంలో ఆ రెండు పార్టీల ద్వంద వైఖరిని ఎండ కడతామని వేణుగోపాల్ గౌడ్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమం లో బీసీ జేఏసీ రాష్ట్ర, జిల్లా నాయకులు డా. చిర్ర రాజు గౌడ్, దాడి మల్లయ్య యాదవ్, డా. సంగాని మల్లేశ్వర్, బోనగాని యాదగిరి, బచ్చు ఆనందం, దాడబోయిన శ్రీకాంత్ యాదవ్, తమ్మేలా శోభరాణి, భీమగాని యాదగిరి, కాసగాని అశోక్ గౌడ్, సమ్మయ్య, బక్కి అవినాష్ పటేల్, తెల్ల సుగుణ, కిషోర్, ప్రమోద, మానస తదితరులు పాల్గొన్నారు.