15-12-2025 02:00:27 AM
కమాన్ పూర్, డిసెంబర్ 14 విజయ క్రాంతి)కాంగ్రెస్ పార్టీ బలపరిచి కమాన్ పూర్ మండలంలో తాజాగా గెలుపొందిన నూతన సర్పంచ్ లకు, ఉప సర్పంచ్ లకు, వార్డు సభ్యులకు కమాన్ పూర్ మండల కేంద్రంలోని పిల్లిపల్లెలో గల కే ఎన్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ సయీద్ అన్వర్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి నూతన ప్ర జాప్రతినిధులకు శాలువాలు కప్పి ఘనంగా ఆత్మీయ సత్కారం చేశారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.