calender_icon.png 9 May, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ స్వాతంత్రంలో ముఖ్య పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ

22-04-2025 10:35:28 PM

మంథని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రసాద్, పీఏసీ ఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్...

మంథని (విజయక్రాంతి): దేశానికి స్వాతంత్రం కోసం ప్రముఖ పాత్ర పోపించింది కాంగ్రెస్ పార్టీయే నని మంథని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ లు అన్నారు. జై బాపు జై భీమ్  జై సంవిధాన్ ముగింపు కార్యక్రమాన్ని మంథని మండలం నాగేపల్లి, అడవిసోమన్ పల్లి గ్రామాల్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్, కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ... దేశ స్వాతంత్ర్యానికి పూర్వం స్వాతంత్రం కోసం కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ దేశం కోసం ప్రాణ త్యాగం చేశారని, వారి ఆశయాలను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మతం పేరుతో రాజకీయం చేస్తుందని, అదేవిధంగా నరేంద్ర మోడి ఎన్నికలకు ముందు సామాన్యుల జన్ ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు జమచేస్తామని వాగ్ధానం చేసి జమ చేయలేదని అన్నారు. గ్యాస్ సిలిండర్ కు రూ.500 నుంచి రూ.1200కు పెంచిందన్నారు. దేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ శ్రీరామ రక్ష అని అన్నారు. అంతేగాకుండా ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ వారి అడుగు జాడల్లో నడుస్తున్నామని అన్నారు.

మంథని నియోజకవర్గం అభివృద్ధి మంత్రి శ్రీధర్ బాబుతోనే సాధ్యమవుతుందని రానున్న రోజుల్లో మంథని అభివృద్ధితో రూపురేఖలే మారుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ రావికంటి సతీష్ కుమార్, మంథని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెండ్లి రమా-సురేష్ రెడ్డి, నాయకులు కుడుదుల వెంకన్న, పేరవేన లింగయ్య, మంథని సత్యనారాయణ, వొడ్నాల శ్రీనివాస్, సాదుల శ్రీకాంత్, ఎరుకల ప్రవీణ్, బాపు, మహేందర్, బండం మధు, సమ్మిరెడ్డి, ఆకాష్, బెజ్జెంకి మల్లయ్య, అక్కపాక సదయ్య, మాజీ సర్పంచులు, ఎంపిటీసీలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.