23-07-2025 07:16:17 PM
ముత్తారం తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి..
ముత్తారం (విజయక్రాంతి): మండలంలో ఆర్థికంగా వెనుకబడిన లబ్ధిదారులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యేల చూడాలని ముత్తారం తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి(Tahsildar Madhusudhan Reddy) సూచించారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో ఎంపీడీవో సురేష్, ఎస్సై నరేష్ లతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో ఇందిరమ్మ ఖర్చులు తగ్గించేలా తాపీ మేస్త్రీలతో మాట్లాడదామన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వారు ఇందిరమ్మ లబ్ధిదారులను కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని ఎవరు కూడా అధైర్యపడద్దని సూచించారు.