11-12-2025 01:28:26 AM
సంగారెడ్డి/ సిద్దిపేట/ మెదక్, డిసెంబర్ 10(విజయక్రాంతి)/ పాపన్నపేట :తొలి దశ పంచాయతీ ఎన్నికలు ఈనెల 11న జరగనున్నాయి. సర్పంచి, వార్డు స్థానాలకు పోటీలో ఉన్న అభ్యర్థుల భవిష్యత్తు నేటితో తేలిపోనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ పం చాయతీలకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈనె ల 11న తొలి విడత, ఈనెల 14న రెండో విడ త, ఈనెల 17న మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి.
తొలి విడతలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 459 సర్పంచ్ స్థా నాలకు, 4080 వార్డు సభ్యలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, ఇందులో 39 సర్పం చ్ స్థానాలు, 670 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 420 సర్పంచ్ స్థానాలకు, 3410 వార్డు స్థానాలకు ఎన్నిక లు గురువారం జరగనున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఎన్నికలు జరిగే గ్రామాలకు ఎన్నికల సిబ్బంది బుధవారం తరలివెళ్ళారు. గురువారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రా రంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభిస్తారు.
సంగారెడ్డి జిల్లాలో ఇలా...
సంగారెడ్డి జిల్లాలో తొలి విడత ఎన్నికలు గురువారం జరుగుతున్నాయి. జిల్లాలోని సం గారెడ్డి, కంది, కొండాపూర్, పటాన్చెరు, సదాశివపేట, గుమ్మడిదల, హత్నూర మండలాల్లోని 136 సర్పంచ్ స్థానాలకు 1246 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలి. అయితే 7 సర్పంచ్ స్థానాలు, 113 వార్డులు ఏకగ్రీవం కావడంతో 129 సర్పంచ్, 1133 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలో 3,243 మంది అభ్యర్థులు బరి లో ఉన్నారు.
సిద్దిపేట జిల్లాలో...
సిద్దిపేట జిల్లాలో తొలి విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో తొలి విడతలో దౌల్తాబాద్, గజ్వేల్, జగదేశ్పూర్, మర్కూక్, ములుగు, రాయపోల్, వర్గల్ మండలాల్లో జరగనున్నాయి. ఈ మండలాల పరిధిలోని 163 సర్పంచ్, 1432 వార్డులకు ఎన్నికలు జ రగాల్సి ఉండగా 16 సర్పంచ్, 224 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 147 సర్పంచ్, 1208 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నా యి. వీటిలో సర్పంచ్ స్థానానికి 481 మంది, వార్డులకు 2,972 మంది బరిలో ఉన్నారు.
మెదక్ జిల్లాలో...
మెదక్ జిల్లాలో తొలి విడత ఎన్నికల్లో భా గంగా జిల్లాలోని అల్లాదుర్గం, రేగోడు, టేక్మా ల్, హవేళీ ఘణపూర్, పాపన్నపేట, పెద్దశంకరంపేట మండలాల్లో ఎన్నికలు జరగను న్నాయి. ఈ మండలాల్లోని 160 సర్పంచ్, 1,402 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఇప్పటికే 16 సర్పంచ్, 333 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 144 సర్పంచ్ స్థానాలకు, 1,069 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
నేడే తెలనున్న భవితవ్యం...
తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా గురువారం ఎన్నికలు, కౌంటింగ్ నిర్వహించనున్నారు. దీంతో పోటీ పడుతున్న అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుం ది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ బలపర్చిన అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. అంతేగాకుండా మ ద్యం, డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేశా రు. అయితే గురువారం జరిగే ఎన్నికలో ఓ టరన్న ఎవరిని అందలమెక్కిస్తారో అనేది కొన్ని గంటల వరకు వేచి చూడాల్సిందే.
ఉప సర్పంచ్ స్థానానికి గురి..
పలు పంచాయతీల్లో సర్పంచి రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంతో ఔత్సా హికుల చూపు ఉపసర్పంచ్ పదవి పై పడింది. ఉప సర్పంచ్ పదవి కూడా ప్రాధా న్యం ఉండడంతో వార్డు సభ్యులుగా పోటీ చేసి, ఉపసర్పంచ్ పదవి దక్కించుకునే ఆలోచనలో మరికొందరు ఉన్నారు.