11-12-2025 01:26:13 AM
నంగునూరు, డిసెంబర్ 10:పంచాయతీ ఎన్నికల పోరులో సర్పంచ్ పదవికే కాకుండా, ఇప్పుడు ఉప సర్పంచ్ పదవికి కూడా అనూహ్యమైన డిమాండ్ పెరుగుతోంది.గ్రామ పంచాయతీ బిల్లుల చెల్లింపు ల్లో సర్పంచ్,సెక్రటరీతో పాటు ఉప సర్పంచుకు కూడా ’జాయింట్ చెక్ పవర్’ ఉండటంతో ఈ పదవికి ఇంతటి ప్రాధాన్యత సం తరించుకుంది.సర్పంచ్ పదవికి రిజర్వేషన్లు కలిసిరాని ఆశావహులు వార్డు మెంబర్గా బరిలో నిలబడి, గెలిచిన తర్వాత ప్లాన్ ‘బి’పరోక్ష పద్ధతిలో జరిగే ఎన్నిక ద్వారా ఉప సర్పంచ్ పదవిని దక్కించుకోవాలని తీవ్రం గా ప్రయత్నిస్తున్నారు.
ఉప సర్పంచ్ పదవిపై ఆశావహులు దృష్టి
గ్రామ పంచాయతీ నిధులు, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన చెక్కులపై స ర్పంచ్, సెక్రటరీతో పాటు ఉప సర్పంచ్ కూ డా సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ ’జాయింట్ చెక్ పవర్’ ఉప సర్పంచ్కు గ్రామ ఆర్థిక వ్యవహారాలపై పూర్తి నియంత్రణను ఇ స్తుండటంతో, ఈ పదవిని దక్కించుకోవడానికి ఆశావహులు తెగ ప్రయత్నిస్తున్నారు.
మేజర్ పంచాయతీల్లో..భారీ డీల్స్
మండలంలో పలు మేజర్ పంచాయతీల్లో పోటీ మరింత తీవ్రమైంది.ఉప సర్పం చ్ పదవిని దక్కించుకోవడానికి ఆశావహు లు భారీగా డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో వార్డు సభ్యుడిగా గెలవడానికి, ఆ తర్వాత ఉప సర్పంచ్గా ఎన్నిక కావడానికి కొందరు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.ఉప సర్పంచ్ ఎన్నికలో తమకు మద్దతిచ్చే వార్డు సభ్యుల కు భారీగా నజరానాలు ప్రకటిస్తున్నారు. పో టీ ఎక్కువగా ఉన్న చోట్ల, ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు సభ్యులకు కూడా లక్ష రూపా యల వరకు నగదు ఆఫర్లు ఇస్తూ ముందస్తు డీల్స్ కుదుర్చుకుంటున్నారు.
జనరల్ స్థానాల్లోనూ తీవ్ర పోరాటం
నంగునూరు మండలంలో మొత్తం 25 గ్రామపంచాయతిలో రెండు గ్రామాలు ఏకగ్రీవం కావడంతో 23 గ్రామ పంచాయ తీలకు 12 జనరల్ స్థానాల కు ఎన్నికలు జరగనున్నాయి.జనరల్ స్థానాల్లో పోటీ మరింత తీవ్రంగా ఉంది. ఇక్కడ సర్పంచ్ పదవి ప్రత్యర్థి వర్గానికి దక్కినా, ఉప సర్పంచ్ పదవి తమ చేతిలో ఉంటే ’చెక్ పవర్’ ద్వారా వారిని నియంత్రించవచ్చని పోటీ పడుతున్నవారు భావిస్తున్నారు.
అందుకే, సర్పంచ్ పదవి దక్కనివారు కూడా వార్డు సభ్యులుగా గెలిచి, మెజారిటీ సభ్యుల మద్దతు కూడగట్టేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నా రు. ఈ ఎన్నికల వాతావరణంలో అనేక మే జర్ గ్రామాల్లో అభ్యర్థులు గెలుపుపై ఆందోళనతో, పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న ప్పటికీ, విజయంపై అయోమయంలో ఉన్న ట్లు తెలుస్తోంది. పలు గ్రామాల్లో ప్రచార పర్వం జోరుగా సాగుతోంది.