27-12-2025 12:00:00 AM
చేవెళ్ల,డిసెంబర్ 26( విజయక్రాంతి): చేవెళ్ల నియోజవర్గంలో సిపిఐ 100 సంవత్సరాలు శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి చేవెళ్ల మండల కేంద్రంలోని భూ పోరాట కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మొయినాబాద్ మండల కేంద్రంలో, తోల్కట్ట కేతిరెడ్డిపల్లి గ్రామాలలో సిపిఐ జండాలతో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చేవెళ్ల మండల కార్యదర్శి ఎం సత్తిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చేవెళ్లలోని భూ పోరాట కేంద్రంలో శతాబ్ది ఉత్సవాలు సందర్భంగా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కే రామస్వామి హాజరై సిపిఐ జండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిపిఐ పార్టీ తరఫున గెలిచిన వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు .
ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ప్రభు లింగం సిపిఐ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి మాట్లాడుతూ 100 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటమైన ఘనత సిపిఐదని ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి పార్టీ ఎర్రజెండా అని భూమి కోసం భక్తి కోసం నిరంతరం బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం పోరాటం చేసి పార్టీ ఎర్రజెండా అని వారు కొనియాడారు.
చేవెళ్ల నియోజవర్గం లోని మైనా బాద్ చేవెళ్ల షాబాద్ మండలాలలో ఘనంగా జెండాలు సిపిఐ నాయకులు ఆవిష్కరించారు జనవరి 18 జరిగే శతాబ్ది ఉత్సవాలు ముగింపు సదస్సు ఖమ్మం పట్టణంలో భారీ బహిరంగ సభ జరుగుతుందని ఈ బహిరంగ సభకు దేశవ్యాప్తంగా ఉన్న సిపిఐ వామపక్ష నాయకులు కార్యకర్తలు దాదాపు 5 లక్షల మందితో పెద్ద బహిరంగ సభ ఉంటుందని ఈ బహిరంగ సభకు 40 దేశాల ప్రతినిధులు వస్తున్నారని ఈ కార్యక్రమానికి జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు పాల్గొంటారని వారు తెలియజేశారు.
ఈ సందర్భంలో మరో ముఖ్య అతిథులు ఎం ప్రభు లింగం సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలు అమలుపరచాలని ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కేంద్రప్రభుత్వం కార్మికులకు ఇస్తున్న లేబర్ కోడ్ లను పరిశీలించాలని కనీస వేతనాలు ఇవ్వాలని గ్రామ గ్రామాల్లో సిపిఐ పార్టీ బలోపేతం చేయాలని వారి సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో బి కే ఎం జిల్లా అధ్యక్షుడు జే అంజయ్య రైతు సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గీతా కార్మికుల నాయకుడు ఎం సుధాకర్ గౌడ్ ఇన్స్టాప్ జిల్లా అధ్యక్షుడు ఎండి మక్బూల్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల మొయినాబాద్ మండల కార్యదర్శి కే శ్రీనివాస్ ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు శివ వెంకటయ్య షాబాద్ మండల కార్యదర్శి పాలమాకుల శ్రీశైలం మాజీ కార్యదర్శి నక్క జంగయ్య సిపిఐ నాయకుడు షాబాద్ నరసయ్య యాదగిరి పెంటయ్య అంజిరెడ్డి వెంకటయ్య యాదమ్మ లలిత సుగుణమ్మ శంకర్పల్లి మండలం మహిళా సంఘం నాయకులను రాములమ్మ తదితరులు పాల్గొన్నారు