calender_icon.png 27 December, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇదే స్ఫూర్తిని పరిషత్ ఎన్నికల్లో చాటాలి

27-12-2025 12:00:00 AM

సర్పంచ్ ఎన్నికలు విజయం సాధించిన సర్పంచ్, వార్డు సభ్యులను అభినందించిన ఇన్చార్జి భీమ్ భరత్

చేవెళ్ల, డిసెంబర్ 26(విజయక్రాంతి): గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని తన పూర్తి మద్దతు సహకారం ఉంటుందని చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్  పేర్కొన్నారు.  ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన  సర్పంచ్ లు అయన ను కలిసి సన్మానం చేశారు. చేవెళ్ళ మండలం  ఎర్వ గూడ గ్రామ సర్పంచ్ అభ్యర్థి దయాకర్ రెడ్డి , ఉప సర్పంచ్ గా యాదయ్య , వార్డు సభ్యులు సతీష్ గౌడ్ , సత్యనారాయణ, మాజీ సర్పంచ్ యాదయ్య , భీమయ్య నర్సింలు వీరయ్య వెంకటేష్ , నాగేష్ , సురేష్ , కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

శంకర్ పల్లి మండలం    లక్ష్మారెడ్డి గూడెం గ్రామం సర్పంచ్ నారగూడెం దివ్య గోవర్ధన్, ఉపసర్పంచ్ యాస  ఇంద్రారెడ్డి వార్డు సభ్యులు  శ్రీశైలం, పరమయ్య,  మనోహర్,  చంద్రయ్య తదితరులు ఉన్నారు. చేవెళ్ళ మండలం  తల్లారం దుద్దాగు ఉప సర్పంచ్ మహమ్మద్ నవాజ్, దుద్దాగు కోనపురం అశోక్ తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ళ మండలం  గొల్ల పల్లి  గ్రామ సర్పంచ్ గా శ్రీనివాస్ గౌడ్ తదితర నాయకులు కలిసారు.

రావుల పల్లి గ్రామ నాయకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా భీమ్ భరత్  వారికి  శాలువాతో  ఘనంగా సత్కరించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచిన జిల్లా ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల విశ్వాసమే కాంగ్రెస్ పార్టీ బలమని, గ్రామ స్థాయిలో పార్టీకి వచ్చిన ఆదరణ భవిష్యత్తులో మరింత ప్రజాసేవకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.

పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించి ఈ విజయంలో భాగస్వాములైన, నాయకులు,కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు *భీమ్ భరత్  హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఎన్నికైన ప్రజాప్రతినిధులు నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.